ఎవరీ మాధోలాల్ హుస్సేన్
క్రీ.శ 1538లో జన్మించిన మాధోలాల్ హుస్సేన్ అసలు పేరు షా హుస్సేన్. సూఫీ సన్యాసిగా విశేష ఆదరణ పొందిన ఈయన మాధో అనే హిందూ కుర్రాడిని ప్రేమించాడు. చనిపోయిన తర్వాత ఇద్దరిని బాఘ్బాన్పుర్లోనే సమాధి చేశారు.
ఈ వేడుక ప్రత్యేకత ఏంటి?
మాధోలాల్ హుస్సేన్‌కు అతీత శక్తులున్నాయని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఏటా వేల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు తమ మొక్కులు తీర్చుకుంటారు.
"నేను నా కూతురితో ఇక్కడకు వచ్చాను. మా పాప చిన్నప్పటి నుంచి సరిగ్గా నడవలేదు. ఎక్కువగా అనారోగ్యం పాలవుతుంది. మా పాప త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థించాను. మాధోలాల్ హుస్సేన్‌పై నాకు పూర్తి నమ్మకముంది. ఆయన నా ప్రార్థనలు మన్నిస్తాడు" -రఖాయా భట్, భక్తురాలు
తూర్పు లాహోర్‌లోని బాఘ్బాన్ఫూర్లో పెద్ద మంటను మండించి మేలా చిరాఘ్ పండుగను ఉత్సవంలా జరుపుతారు. మార్చి 30 నుంచి మూడు రోజుల పాటు ఈ వేడుక జరిగింది.