అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించుకుని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లకు (imran khan afghanistan) మద్దతు పలుకుతున్న పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. పారదర్శకత కలిగి, నిస్పక్షపాతంగా వ్యవహరించే ప్రభుత్వాన్ని (afghan news) ఏర్పాటు చేయడంలో విఫలమైతే అఫ్గాన్‌లో అంతర్యుద్ధం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అదే జరిగితే తీవ్రవాదులకు అఫ్గానిస్థాన్ కంచుకోటగా మారుతుందని అభిప్రాయపడ్డారు. మంగళవారం.. ఓ ప్రముఖ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
"తాలిబన్లు తమ ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు ఇవ్వాలి. లేకుంటే భవిష్యత్‌లో అంతర్యుద్ధం జరిగే అవకాశం ఉంది. వారు మానవ హక్కులను గౌరవించాలి. మహిళలకు విద్య అందకుండా దూరం చేయడం ఇస్లాంకు విరుద్ధం."
-ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ ప్రధాని
తాలిబన్ల ప్రభుత్వాన్ని పాకిస్థాన్ గుర్తించడం మిత్రదేశాల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు ఇమ్రాన్ ఖాన్. తాలిబన్ల పాలనను గమనించి తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి : Joe Biden: సంక్షోభాలపై సమష్టి పోరుకు బైడెన్ పిలుపు