డ్రాగన్ దేశంలో మూడు రోజుల పర్యటన కోసం బీజింగ్ చేరుకున్నారు భారత విదేశాంగ మంత్రి జై శంకర్. పలు రంగాల్లో ఇరుదేశాల మధ్య పరస్పర సహకారం మరింత బలోపేతంతో పాటు రెండవ ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొననున్నారు. సోమవారం నుంచి మూడు రోజుల పాటు జైశంకర్ పర్యటన సాగనుంది.
ఈ ఏడాది చైనా అధ్యక్షుడు భారత్‌లో పర్యటించనున్నారు. మోదీతో జిన్‌పింగ్ ద్వైపాక్షిక చర్చల వివరాలపైనా ఇరుదేశాల ప్రతినిధులు చర్చలు జరిపే అవకాశముంది.
భాజపా సర్కారు రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత చైనాలో పర్యటిస్తోన్న తొలి భారత మంత్రిగా జై శంకర్ నిలిచారు. ఆర్టికల్ 370 రద్దుకు ముందే విదేశాంగ మంత్రి పర్యటన ఖరారైనట్లు అధికారులు తెలిపారు.
కశ్మీర్ విషయం
కశ్మీర్ విషయంలో భారత్‌తో పాక్ దౌత్య సంబంధాలు రద్దు చేసుకున్న తర్వాత జైశంకర్ చైనాలో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల కశ్మీర్‌పై భారత్ నిర్ణయాన్ని చైనా వ్యతిరేకించింది. పాక్ విదేశాంగ మంత్రి మహమూద్ ఖురేషి చైనా పర్యటనకు వెళ్లి కశ్మీర్‌పై ఐరాసలో డ్రాగన్ మద్దతు కోరారు.