భారత్ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించడానికి ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం నిర్ణయించింది. గిల్గిట్- బాల్టిస్థాన్ శాసనసభ ఎన్నికలు ఆగస్టు 18న నిర్వహించనున్నట్టు దేశాధ్యక్షుడు అరిఫ్ అల్వి ఉత్తర్వులు జారీ చేశారు.
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు వీటిని జరపనున్నట్టు తెలిపారు. అయితే ఈ ప్రాంతం జమ్మూ-కశ్మీర్‌లో అంతర్భాగమని భారత్ అభ్యంతరం తెలిపింది.