ETV Bharat / international

భారత్​తో సరిహద్దు రగడపై చైనా శాంతి మంత్రం!

భారత్​-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు ప్రతిష్టంభనకు తెరదించేందుకు ఇరుదేశాల అధినేతల మధ్య కుదిరిన ఏకాభిప్రాయాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది చైనా. విభేదాలు... వివాదాలకు దారి తీయకుండా చూసుకోవాలని అభిప్రాయపడింది. సరిహద్దులో శాంతి నెలకొల్పేందుకు ఇరు పక్షాలు పని చేయాలని సూచించింది.

author img

By

Published : Jun 8, 2020, 4:53 PM IST

Eastern Ladakh standoff
'దేశాధినేతల మధ్య ఏకాభిప్రాయాన్ని అమలు చేయాలి'

భారత్​తో సరిహద్దు ఉద్రిక్తతలపై తాజాగా శాంతి మంత్రం జపిస్తోంది చైనా. వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి నెలకొల్పి, ప్రతిష్టంభనలను చర్చల ద్వారా పరిష్కరించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని పేర్కొంది. సరిహద్దు​ విషయంలో ఇరు దేశాధినేతల మధ్య కుదిరిన ఏకాభిప్రాయాన్ని అమలు చేయాల్సిన అవసరాన్ని ఇటీవలి సైనిక స్థాయి చర్చలు సూచిస్తున్నట్లు అభిప్రాయపడింది.

సరిహద్దు ప్రతిష్టంభనను శాంతియుతంగా పరిష్కరించేందుకు ఇరు దేశాల సైనికాధికారుల మధ్య చుశూల్​ ప్రాంతంలో సమావేశం జరిగిన రెండోరోజే ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చునైంగ్ వ్యాఖ్యానించటం ప్రాధాన్యం సంతరించుకుంది.

" సరిహద్దులోని పరిస్థితులపై ఇరు దేశాల దౌత్య, సైనిక అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం పంచుకుంటున్నారు. ఇరు దేశాధినేతల మధ్య కుదిరిన ఏకాభిప్రాయాన్ని ఇరువైపులా అమలు చేయాల్సిన అవసరం ఉంది. విభేదాలు... వివాదాలకు దారి తీయకుండా చూసుకోవాలి. సరిహద్దులో శాంతి, ప్రశాంతత సహా సానుకూల వాతావరణం నెలకొల్పేందుకు ఇరుపక్షాలు పని చేయాలి. ప్రస్తుతం సరిహద్దులో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయి. "

- హువా చునైంగ్​, చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి.

ఇరుదేశాల సైనికులు సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతతను కొనసాగించడానికి నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలని రెండు శిఖరాగ్ర సమావేశాల్లో చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​, భారత ప్రధాని నరేంద్ర మోదీ తీర్మానించడాన్ని ప్రస్తావిస్తూ ఈ మేరకు వ్యాఖ్యానించారు చునైంగ్​.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.