నేపాల్లోని లామ్‌జంగ్ జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రతతో నమోదైందని నేపాల్ జాతీయ భూకంప పర్యవేక్షణ కేంద్రం వెల్లడించింది.
ఉదయం 5.42 నిమిషాల సమయంలో భూమి కంపించింది. ఆ తర్వాత ఉదయం 10 గంటల వరకు దాదాపు 20 సార్లు భూమి స్వల్పంగా వణికిందని సంబంధిత అధికారులు తెలిపారు. ఖాఠ్మండూకు ఈశాన్యంలో 113 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమైందని స్పష్టం చేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: తౌక్టే ధాటికి గుజరాత్లో 45 మంది మృతి