Indonesia Earthquake: ఇండోనేషియాలోని పశ్చిమ సుమత్ర ద్వీపంలో భూమి శుక్రవారం భారీగా కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్ మీద 6.2 తీవ్రత నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. బుక్కిటింగి ప్రాంతానికి 66 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు తెలిపింది.
ఈ ఘటనతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, సునామీ ప్రమాదం కూడా లేదని అధికారులు వెల్లడించారు. కానీ భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
గత ఏడాది జనవరిలో పశ్చిమ సులవేసి ప్రావిన్స్‌లో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల సుమారు 105 మంది మరణించారు. దాదాపు 6,500 మంది ప్రజలు గాయపడ్డారు.
ఇదీ చదవండి: ఉక్రెయిన్‌లో భారత పౌరుల పడిగాపులు- 20 వేలమందికిపైగా..!