ETV Bharat / international

ఓలి... భారత్‌కే వ్యతిరేకమా? రాజీనామా చేయ్‌!

నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి తన పదవికి రాజీనామా చేయాలని సొంతపార్టీ నేతలే డిమాండ్ చేస్తున్నారు. భారత్​కు వ్యతిరేకంగా, చైనాకు అనుకూలంగా.... ఓలి నిర్ణయాలు తీసుకుంటుండడమే ఇందుకు కారణం.

demands for Nepal Prime Minister KP Sharma Oli resign!
ఓలి... భారత్‌కే వ్యతిరేకమా? రాజీనామా చేయ్‌!
author img

By

Published : Jun 26, 2020, 4:38 AM IST

భారత్‌కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్న నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలిపై అసమ్మతి పెరుగుతోంది. సొంతపార్టీ నేతలే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే పార్టీని రెండుగా చీలుస్తామని హెచ్చరిస్తున్నారు.

పార్టీలో చీలిక..!

అన్ని విధాలుగా కేపీ ఓలి విఫలమయ్యారని మాజీ ప్రధాని, నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడు ప్రచండ అన్నారు. ప్రధాని పదవికి ఆయన రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. అంతర్గత కలహాలు చెలరేగుతున్నా రాజీనామా చేసేందుకు ఓలి ససేమిరా అంటున్న నేపథ్యంలో.. పార్టీని రెండుగా చీలుస్తానని ప్రచండ హెచ్చరించారు. ఆయనతో కలవడమే రాజకీయ నాయకుడిగా తాను చేసిన అతిపెద్ద తప్పని పేర్కొన్నారు. పార్టీలో ఓలి అసమ్మతి నేతల మద్దతు ప్రచండకు లభించడం గమనార్హం.

నేపాల్‌ ప్రధాని కేపీ ఓలికి చైనాతో సత్సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. గతంలోనూ ఆయన డ్రాగన్‌ దేశానికి మద్దతుగా భారత్‌కు వ్యతిరేకంగా ప్రవర్తించారు. తాజాగా భారత భూభాగాన్ని తమదిగా చూపుతూ సవరించిన చిత్రపటాన్ని నేపాల్‌ పార్లమెంటు ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని పార్టీలోని కొన్ని వర్గాలు వ్యతిరేకించాయి.

ఇదీ చూడండి: లాడెన్​​ అమరవీరుడంటూ కీర్తించిన ప్రధాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.