ETV Bharat / international

'ఐసీఎంఆర్ నిర్ణయంపై చైనా ఆందోళన'

author img

By

Published : Apr 28, 2020, 4:54 PM IST

Updated : Apr 29, 2020, 12:11 AM IST

చైనాలోని రెండు కంపెనీలు సరఫరా చేసిన కొవిడ్-19 కిట్లపై ఐసీఎంఆర్ నిషేధం విధించింది. ఈ నిర్ణయంపై చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని భారత్​లో చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి తెలిపారు.

China on ICMR's decision to not use COVID-19 test kits
ఐసీఎంఆర్ నిర్ణయంపై చైనా ఆందోళన

ర్యాపిడ్ టెస్ట్ కిట్ల వినియోగంలో భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) నిర్ణయంపై చైనా స్పందించింది. తమ దేశంలోని రెండు కంపెనీలు సరఫరా చేసిన కొవిడ్-19 కిట్లపై నిషేధం విధించడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన చైనా.. భారత్ సహేతుకంగా ఈ సమస్యను పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే.. చైనా సరఫరా చేసిన కిట్ల ద్వారా తప్పుడు ఫలితాలు వస్తుండటం వల్ల వాటిని వినియోగించరాదని ఐసీఎంఆర్ నిర్ణయించింది.

ఈ నిర్ణయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది చైనా. తాము ఎగుమతి చేసిన వైద్య పరికరాలు ఎంతో నాణ్యతతో కూడుకున్నవని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి జీ రోంగ్ చెప్పారు.

'చైనా ఉత్పత్తులు ఎంతో నాణ్యతతో కూడుకున్నవి. వీటిపై తప్పుడు ప్రచారాలు చేయడం బాధ్యరాహిత్యం. అయినప్పటికీ వైరస్ పై పోరాటానికి భారత్ కు మేం సహకరిస్తాం. త్వరలోనే ఈ సమస్యను అధిగమిస్తాం.'

- జీ రోంగ్, భారత్​లో చైనా రాయబార కార్యలయ ప్రతినిధి

ఆ కంపెనీల నుంచే ఐరోపా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాలకూ కిట్లు సరఫరా అయ్యాయని.. అయితే వాటికి మంచి గుర్తింపు లభించిందని జీ రోంగ్ తెలిపారు.

'5 లక్షల కిట్లకు ఎలాంటి సొమ్ము చెల్లించం'

చైనా కంపెనీలు గ్యాంగ్ ఝౌ వాండ్ఫో బయోటెక్, ఝుహై లివ్జన్ డయాగ్నోస్టిక్స్ సరఫరా చేసిన ర్యాపిడ్ టెస్ట్ కిట్ల వినియోగాన్ని తక్షణమే నిలిపివేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఐసీఎంఆర్ సూచించింది.

సుమారు రెండు వారాల క్రితం ఈ రెండు కంపెనీలు భారత్ కు 5 లక్షల కిట్లను సరఫరా చేశాయి. అయితే ఈ కిట్లకు సంబంధించి తాము ఎలాంటి సొమ్ము చెల్లించమని ఐసీఎంఆర్ పేర్కొంది.

ఇదీ చదవండి: చైనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోళ్లు రద్దు- కారణం ఇదే

Last Updated : Apr 29, 2020, 12:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.