ETV Bharat / international

స్కూళ్ల మూతతో భారత్​కు 400 బిలియన్ డాలర్లు నష్టం

పాఠశాలలు మూసి ఉంచడం వల్ల భారత్​కు 400 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. దక్షిణాసియాలోని దేశాలు మొత్తంగా 622 మిలియన్ డాలర్లు నష్టపోతాయని తెలిపింది. విద్యా వ్యవస్థ నుంచి 55 లక్షల మంది వైదొలిగారని.. ఇది ఒక తరానికి చెందిన విద్యార్థులపై జీవితకాల ప్రభావం చూపుతుందని తెలిపింది.

author img

By

Published : Oct 12, 2020, 3:36 PM IST

COVID-19 school closure may cost over USD 400 billion to India, cause learning losses: World Bank
స్కూళ్ల మూతతో భారత్​ నష్టం 400 బిలియన్ డాలర్లు

భారత విద్యా వ్యవస్థపై కొవిడ్ మహమ్మారి తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా దేశంలో సుదీర్ఘ కాలంగా పాఠశాలలు మూతపడి ఉండటం వల్ల భారత్​కు 400 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని ప్రపంచబ్యాంకు నివేదిక వెల్లడించింది.

'బీటెన్ ఆర్ బ్రోకెన్? దక్షిణాసియాలో కొవిడ్-19, అనధికారికత' పేరిట ప్రపంచ బ్యాంకు.. ఈ నివేదిక విడుదల చేసింది. దక్షిణాసియా దేశాల జీడీపీ తీవ్రంగా పడిపోతోందని నివేదికలో పేర్కొంది. ఇప్పటివరకు ఎరుగని తీవ్రమైన ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయేందుకు ఆయా దేశాలు సిద్ధంగా ఉన్నాయని విశ్లేషించింది.

ప్రస్తుత పరిస్థితుల్లో పాఠశాలల మూసివేత వల్ల దక్షిణాసియాలోని దేశాలు 622 బిలియన్ డాలర్లు నష్టపోతాయని నివేదిక లో పేర్కొంది ప్రపంచ బ్యాంకు. ఇందులో సింహభాగం భారత్​దే.

"పాఠశాలల పునఃప్రారంభం విషయంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారంపై ఈ అంచనాలు ఆధారపడి ఉన్నాయి. ఆసియా దేశాలకు సంబంధించిన గణాంకాలను సంక్షిప్తం చేస్తే.. పాఠశాలల మూసివేత వల్ల ఈ ప్రాంతం 622 బిలియన్ డాలర్లు కోల్పోతుంది. నిరాశావాద దృక్పథం ప్రకారం ఈ సంఖ్య 880 బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. నష్టంలో ఎక్కువ వాటా భారత్​దే. ఈ ప్రాంతంలోని ప్రభుత్వాలు ప్రాథమిక, మాధ్యమిక విద్యలో ఏడాదికి 400 బిలియన్ డాలర్లు మాత్రమే ఖర్చు చేస్తున్నాయి. ఆర్థిక ఉత్పాదకత ప్రకారం ఈ ఖర్చు కన్నా నష్టం చాలా ఎక్కువగా ఉంది."

-ప్రపంచ బ్యాంకు నివేదిక

విద్యా వ్యవస్థ నుంచి 55 లక్షల మంది విద్యార్థులు వైదొలిగేందుకు మహమ్మారి కారణమైందని ప్రపంచబ్యాంకు నివేదిక పేర్కొంది. ఇది ఒక తరానికి చెందిన విద్యార్థులపై జీవితకాల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

"దక్షిణాసియాలో పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయడం వల్ల విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడింది. 39.1 కోట్ల మంది విద్యార్థులు ప్రాథమిక, మాధ్యమిక విద్యకు దూరమయ్యారు. ఈ ప్రమాదం తాలూకు నష్టాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు కృషి చేసినప్పటికీ.. రిమోట్ లెర్నింగ్ ద్వారా విద్యార్థులతో మమేకమవడం కష్టంగా మారింది. సుమారు ఐదు నెలలుగా విద్యార్థులు పాఠశాలలకు దూరంగా ఉన్నారు. ఈ సుదీర్ఘ విరామంలో విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకోవడం పక్కన పెడితే.. నేర్చుకున్నవి కూడా మర్చిపోయారు."

-ప్రపంచ బ్యాంకు నివేదిక

దక్షిణాసియాలోని పిల్లలు లేబర్ మార్కెట్​లోకి ప్రవేశించిన తర్వాత సగటున 4,400 డాలర్ల జీవితకాల ఆదాయాన్ని కోల్పోతారని నివేదిక లెక్కగట్టింది. వీరి మొత్తం సంపాదనలో ఈ నష్టం 5 శాతంగా ఉంటుందని తెలిపింది.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.