హిందూ మహాసముద్రంలో కీలకమైన ద్వీపదేశమైన మాల్దీవులకు బాసటగా నిలిచింది భారత్. 150 మిలియన్ అమెరికన్ డాలర్లను నగదు రూపంలో అందించింది. 400మిలియన్ అమెరికన్ డాలర్లను మారకం పద్ధతిలో అందించేందుకు గతేడాది జూన్లో ఒప్పందం కుదుర్చుకుంది భారత్. ఈ ఒప్పందంలో భాగంగా తాజాగా 150 మిలియన్ అమెరికా డాలర్లను అందించింది.
"భారత్ 150మిలియన్ డాలర్ల కరెన్సీని నగదు రూపంలో మాల్దీవులకు అందించింది. జులై 2019లో కుదిరిన ఒప్పందం మేరకు అమెరికా కరెన్సీని అందించింది. కరోనా వేళ సాయం అందించేందుకే ఈ సాయం చేసింది."
-మాల్దీవుల్లో భారత రాయబారి ప్రకటన
ఇదీ చదవండి: 'కరోనా కట్టడికి ఆ రెండే ప్రధాన అస్త్రాలు'