ETV Bharat / international

కోలుకున్నాక 8 నెలల వరకు బేఫికర్​!

కొవిడ్​ రోగులకు తీపి కబురు చెప్పారు ఆస్ట్రేలియా పరిశోధకులు. కరోనా​ నుంచి కోలుకున్న వారిలో దీర్ఘకాలం పాటు రోగ నిరోధక శక్తి ఉంటుందని.. ఫలితంగా 8 నెలల వరకు మళ్లీ వైరస్​ బారిన పడకుండా ఉండగలుగుతారని అంటున్నారు.

COVID-19 immunity lasts at least 8 months, hope for longevity of vaccinations: Study
ఒక్కసారి కోలుకున్నాక.. 8 నెలల వరకు నో ఫికర్​!
author img

By

Published : Dec 23, 2020, 12:44 PM IST

కరోనా నుంచి కోలుకున్న వారిలో రోగ నిరోధక శక్తి సుదీర్ఘకాలం ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. ఫలితంగా.. మళ్లీ ఎనిమిది నెలల వరకు వైరస్​ బారిన పడకుండా ఉండగలుగుతారని నిర్ధరణ అయింది. ఆస్ట్రేలియాలోని మోనాష్​ విశ్వవిద్యాలయ పరిశోధకులు చేసిన ఓ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వీరి పరిశోధన ఫలితాలను 'ఇమ్యూనాలజీ' జర్నల్​ ప్రచురించింది.

రోగ నిరోధక వ్యవస్థలోని 'మెమొరీ బీ కణాలు' వైరస్​ దాడికి గురైన పరిస్థితులు గుర్తించుకని, మళ్లీ కరోనా బారిన పడకుండా యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. 25 మంది కొవిడ్ రోగుల్లో 4వ రోజు నుంచి 242 రోజుల మధ్య 36 రక్తనమూనాలు సేకరించి శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం చేపట్టారు. ​కొవిడ్​ వ్యాక్సిన్​ తీసుకున్నప్పటికీ.. రోగ నిరోధక శక్తి అత్యంత త్వరగా తగ్గిపోతుందన్న ఆందోళనల నేపథ్యంలో ఈ పరిశోధన ఫలితాలు వెలువడటం గమనార్హం.

20 రోజుల అనంతరం యాంటీబాడీల ప్రభావం తగ్గుతున్నట్లు పరిశోధకులు ఈ అధ్యయనంలో తేల్చారు. కానీ, మెమొరీ బీ కణాల సాయంతో రోగ నిరోధక శక్తి 8 నెలల వరకు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ఫలితాల బట్టి... వ్యాక్సిన్​ సమర్థత ఎక్కువ కాలం ఉంటుందని పరిశోధకులు విశ్వసిస్తున్నారు.

ఇదీ చూడండి:కరోనా వ్యాప్తి ఉద్ధృతం- మరో దేశంలో లాక్​డౌన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.