ETV Bharat / international

రెండు వారాల్లో ఆ దేశంలోని సగం జనాభాకు కరోనా! - రెండు వారాల్లో సగం జనాభాకు కరోనా

కరోనా వైరస్ మళ్లీ పడగ విప్పుతోంది. దేశ జనాభాలో సగం మందికి రెండు వారాల్లో కరోనా సోకుతుందని మయన్మార్​ను ఉద్దేశించి బ్రిటన్ రాయబారి పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. 5.4 కోట్లు జనాభా ఉన్న మయన్మార్​లో.. 2.7 కోట్ల మందికి పక్షం రోజుల్లోనే కరోనా సోకుతుందని చెబుతున్నారు.

covid in myanmar
కరోనా కేసులు
author img

By

Published : Aug 1, 2021, 1:45 PM IST

సైనిక తిరుగుబాటు, అల్లర్లు, కరోనా మహమ్మారి... ఈ మూడు సమస్యలతో మయన్మార్ అతలాకుతలమవుతోంది. కొద్ది నెలల నుంచి దేశ ప్రజలంతా రాజకీయ ప్రతిష్టంభన మాటున మగ్గిపోతున్నారు. అధికారం కోసం తిరుగుబాటు సాగించి.. దాన్ని నిలుపుకోవడానికే మయన్మార్ జుంటా తన సర్వశక్తులు ఒడ్డుతున్న నేపథ్యంలో.. వైద్య వ్యవస్థ బలహీనంగా మారిపోయింది. ఇక కరోనా మహమ్మారి పంజా విసరడం.. ఆ దేశాన్ని కోలుకోనీయకుండా చేస్తోంది.

బలహీన వైద్య వ్యవస్థ కారణంగా మయన్మార్​లో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు నమోదవుతున్నాయి. పది లక్షల జనాభాకు నమోదవుతున్న ఏడు రోజుల తలసరి మరణాల సంఖ్య 6.29కి పెరిగింది. మే నెలలో భారత్​లో కరోనా తీవ్ర స్థాయిలో ఉన్నప్పటి సంఖ్యతో పోలిస్తే ఇది రెట్టింపు. దీన్ని బట్టి ఆ దేశంలో కరోనా ఏ స్థాయిలో మరణ మృదంగం మోగిస్తోందనే విషయం అర్థమవుతోంది.

రెండు వారాల్లో సగం దేశానికి!

మయన్మార్​లో కరోనా సంక్షోభ స్థాయికి చేరిపోయిందని నిపుణులు చెబుతున్నారు. రెండు వారాల్లోనే దేశంలోని సగం జనాభాకు వైరస్ సోకుతుందని అంచనా వేస్తున్నారు. మయన్మార్ జనాభా 5.4 కోట్లు కాగా.. 2.7 కోట్ల మందికి పక్షం రోజుల్లోనే కరోనా సోకుతుందని చెబుతున్నారు. ఓ నివేదికను ఆధారంగా చేసుకొని ఐరాసలో బ్రిటన్ రాయబారి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ హెచ్చరికలు చేశారు. ఈ నేపథ్యంలో తమ దేశానికి టీకాలు ముందుగా అందించాలని మయన్మార్ రాయబారి.. ఐరాసను అభ్యర్థించారు.

ఇదీ చదవండి: వెయ్యి రెట్లు ఎక్కువగా వైరస్‌ వ్యాప్తి!

అధికారిక లెక్కల ప్రకారం మయన్మార్​లో జూన్ నుంచి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రెండు వారాల్లో కేసుల సంఖ్య 105 శాతం అధికమైంది. అయితే ఇందులో చాలా కేసులను పరిగణనలోకి తీసుకోలేదని నిపుణులు చెబుతున్నారు. అసలు కేసుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.

తాజా గణాంకాల ప్రకారం మయన్మార్​లో కొత్తగా 4,725 కేసులు నమోదయ్యాయి. 392 మంది మరణించారు. కానీ.. వైద్యులు, శ్మశాన నిర్వాహకులు మాత్రం మృతుల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు.

జీవాయుధంగా కరోనా..

మయన్మార్​లో ప్రస్తుతం అల్లకల్లోల పరిస్థితులు ఉన్నాయి. మిలిటరీ ప్రభుత్వం ప్రజల నిరసనలను ఉక్కుపాదంతో అణచివేస్తోంది. మహమ్మారిని విపక్షాలను అణచివేసేందుకు, అధికారాన్ని నిలుపుకునేందుకు ఉపయోగిస్తోందని స్థానిక మానవహక్కుల ఉద్యమకారులు చెబుతున్నారు. కరోనాను జీవాయుధంగా పరిగణిస్తోందని అంటున్నారు.

వైద్యులపై దాడులు

అదే సమయంలో.. నిరసనలో పాల్గొన్న వైద్యులు, వైద్య సిబ్బందిపై మయన్మార్ సైన్యం దాడులకు తెగబడుతోంది. వైద్య వృత్తిలో ఉన్న అనేక మందిపై వారెంట్లు జారీ చేసింది. ఐరాస గణాంకాల ప్రకారం.. మయన్మార్​లో 40 శాతం వైద్య సేవల కేంద్రాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సైన్యానికి భయపడి కొందరు వైద్యులు.. రోగులకు రహస్యంగా చికిత్స చేస్తున్నారు.

మయన్మార్​లో ఇప్పటివరకు 3.2 శాతం జనాభాకు మాత్రమే టీకా అందింది. టీకా పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉండటం ఓ కారణమైతే.. మిలిటరీ ప్రభుత్వం నిర్లక్ష్యం మరో కారణం.

ఇదీ చదవండి: అమెరికాలో కరోనా కల్లోలం- ఫ్లోరిడాలో రికార్డు కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.