ETV Bharat / international

'చైనాలో కరోనా కట్టడికి సామ్యవాద పాలనే కారణం'

author img

By

Published : May 9, 2020, 9:31 PM IST

చైనాలో సామ్యవాద పాలన కారణంగానే కరోనా సంక్షోభాన్ని జయించగలిగామని ఆ దేశ అధ్యక్షుడు జిన్​పింగ్​ స్పష్టం చేశారు. బీజింగ్​లో పాలకేతర పార్టీలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా నాయకత్వంలో ఎలాంటి సవాలునైనా ఎదుర్కోవచ్చని ధీమా వ్యక్తం చేశారు.

VIRUS-XI-CHINA
జిన్​పింగ్​

కరోనాపై విజయంతో చైనా సామ్యవాద రాజకీయ వ్యవస్థ సత్తా ఏమిటో మరోసారి రుజువైందని ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్​పింగ్ ఉద్ఘాటించారు. తమ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్​ చైనా (సీపీసీ) నాయకత్వంలో ఎంతటి సవాలునైనా ఎదుర్కోవచ్చని నిరూపించామని అన్నారు.

బీజింగ్​లో పాలకేతర పార్టీల నుంచి 'కొవిడ్​- 19 నివారణ, నియంత్రణ' సలహాలు స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిన్​పింగ్ మాట్లాడారు. నెల వ్యవధిలో కరోనా తీవ్రతను చైనాలో అదుపులోకి తెచ్చామని, వైరస్​కు మూలమైన వుహాన్​లో 3 నెలల్లోనే సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని స్పష్టం చేశారు.

"ప్రపంచంలో 140 కోట్ల జనాభా, రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న దేశంలో కరోనాపై విజయం అతి గొప్పది. చైనా సామ్యవాద వ్యవస్థ, దాని పరిపాలన విధానాలకు ఎటువంటి సవాలునైనా అధిగమించే సత్తా ఉంది. మానవ నాగరికత పురోగతికి అతిపెద్ద భాగస్వామ్యం అందించే సామర్థ్యం ఉంది."

- షీ జిన్​పింగ్​, చైనా అధ్యక్షుడు

కరోనా వైరస్ విషయంలో చైనా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ప్రపంచ దేశాలు విమర్శిస్తున్నాయి. అంతర్జాతీయ దర్యాప్తునకు అంగీకరించాలని చైనాపై ప్రపంచదేశాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అంతేకాకుండా వుహాన్ వైరాలజీ ల్యాబ్​ నుంచి వైరస్ లీక్​ అయినట్లు అమెరికా ఆరోపిస్తోంది. ఈ పరిస్థితుల్లో జిన్​పింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

పార్టీలకతీతంగా ప్రశంసలు..

ఈ కార్యక్రమంలో సీపీసీ ఉన్నత అధికారులతో పాటు సీపీసీ యేతర పార్టీల కేంద్ర కమిటీ సభ్యులు, ఆల్​ చైనా ఫెడరేషన్​ ఆఫ్​ ఇండస్ట్రీ అండ్ కామర్స్​ సభ్యులు, పార్టీలకు సంబంధం లేని వ్యక్తులు పాల్గొన్నారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవటంలో జిన్​పింగ్​ నేతృత్వంలోని చైనా నాయకత్వాన్ని వీరంతా ప్రశంసించారు. చైనా సామ్యవాద వ్యవస్థతోనే ఇదంతా సాధ్యమైందని మెచ్చుకున్నారు.

ఇదీ చూడండి: ఆర్థిక పునరుత్తేజానికి చైనా పాఠాలు భారత్​కు లాభించేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.