కరోనా వైరస్.. చైనా వాసులను భూతంలా పట్టి పీడిస్తోంది. కొత్తగా మరో 150 మంది మరణించగా.. సోమవారం నాటికి మృతుల సంఖ్య 2,592కు పెరిగినట్లు వైద్య అధికారులు తెలిపారు. సోమవారం ఒక్క రోజులోనే కొత్తగా 409 కేసులు నమోదైనట్లు వివరించారు.
ఆదివారం(97 మృతులు)తో పోల్చితే సోమవారం మృతుల సంఖ్య పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ నిపుణుల బృందం వైరస్ కేంద్ర బిందువు వుహాన్ నగరాన్ని సందర్శించింది. నగరంలోని ఓ మార్కెట్ నుంచి ఈ వైరస్ సోకినట్లు భావిస్తోంది.
ఆ నగరం నుంచి వెళ్లొచ్చు..
వైద్య పరీక్షల్లో వైరస్ లక్షణాలు కనిపించకపోతే.. వుహాన్లో నివాసముంటున్న విదేశీయులు వైద్య నిర్బంధ కేంద్రం నుంచి వెళ్లిపోవచ్చని అధికారులు తెలిపారు. వైరస్ వ్యాప్తిని అరికట్టే ప్రయత్నంలో నగరంలో రవాణా వ్యవస్థను నిలిపేశారు. ఫలితంగా సుమారు 11 మిలియన్ల మందికి జనవరి 23 నుంచి బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
ఇదీ చూడండి: శాంసంగ్ మడత ఫోన్ ప్రీ-బుకింగ్.. ధరెంతో తెలుసా?