ETV Bharat / international

నెగిటివ్ వచ్చినా..  కళ్లె, మలంలో వైరస్​

చైనాలో కరోనా నెగిటివ్​గా తేలిన కొంతమంది రోగుల నుంచి సేకరించిన కళ్లె, మలం నమూనాల్లో వైరస్​ బతికున్నట్లు ఆ దేశ వైద్యులు కనుగొన్నారు. ఈ ఫలితాలతో చైనాలో మళ్లీ వైరస్​ భయం కమ్మేసింది.

Coronavirus found in sputum, faeces of patients with negative COVID-19 pharyngeal swabs
నెగిటివ్ వచ్చింది.. కానీ వాటిల్లో కనిపించింది కరోనా
author img

By

Published : Apr 1, 2020, 7:41 AM IST

చైనాలో మళ్లీ కరోనా భయాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల నెగిటివ్ నిర్ధరణ అయిన కొంత మంది రోగుల నుంచి సేకరించిన కళ్లె, మలం నమూనాల్లో వైరస్​ను గుర్తించారు ఆ దేశ వైద్యులు. ఈ అధ్యయనం అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్​లో ప్రచురితమైంది.

కరోనాకు గురైన వ్యక్తికి ఆసుపత్రి నుంచి విడుదలయ్యే ముందు.. ఎక్కువగా కఫం ద్వారా పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఫలితాలను బట్టే సదరు రోగిని క్వారంటైన్​లో ఉంచాలా లేదా అని నిర్ణయిస్తారని చైనాలోని క్యాపిటల్​ వైద్య విశ్యవిద్యాలయం పరిశోధలుకు తెలిపారు. వచ్చిన ఫలితాలు సరైనవేనా.. లేక శరీరంలోని ఇతర భాగాల నుంచి నమూనాలను సేకరించాలా అనే విషయంపై పరిశోధకులు చర్చలు జరుపుతున్నారు. పరీక్షల్లో నెగిటివ్​గా తేలిన తర్వాత కూడా కొందరు రోగుల కళ్లెలో 39 రోజుల వరకు వైరస్​ ఉంటున్నట్లు గుర్తించారు. మలంలో 13 రోజుల పాటు ఈ సూక్ష్మజీవి ఉనికి కనిపిస్తున్నట్లు తెలిపారు.

మరింత అధ్యయం అవసరం...

రోగులందరి నమూనాలను ప్రోటోకాల్ ప్రకారం.. క్రమపద్దతిలో అధ్యయనం చేయలేదని పరిశోధకులు గుర్తించారు. వచ్చిన పాజిటివ్ ఫలితాల ప్రకారం.. రోగి ద్వారా ఇతరులకు వైరస్ సోకుతుందనే విషయంపై స్పష్టత లేదని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మరింత అధ్యయనం అవసరమని పరిశోధకులు సూచిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.