ETV Bharat / international

చైనాలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

author img

By

Published : Mar 24, 2020, 12:18 PM IST

కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చైనాలో కొత్తగా మరో 78 కేసులు నమోదయ్యాయి. వీరిలో 74మంది విదేశీయులు. సోమవారం మరో ఏడుగురు మృతిచెందారు. ఫలితంగా ఆ దేశంలో మరణాల సంఖ్య 3వేల 277కు చేరింది. అయితే హుబే రాష్ట్రంలో ప్రయాణాలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

coronavirus-cases-rise-to-78-in-china
చైనాలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటివ్​ కేసులు

కరోనా మహమ్మారి నుంచి బయటపడుతున్న చైనాలో మరో ఏడుగురు మృతి చెందారు. దీనితో మృతుల సంఖ్య 3 వేల 277కు చేరింది. తాజాగా మరో 78 కొత‌్త కేసులు నమోదయ్యాయి. ఇందులో 74మంది విదేశీయులున్నారు. దేశంలో కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య 81వేల 171కి పెరిగింది. ఇప్పటివరకు 73 వేల 159 మంది కోలుకున్నారు. 4 వేల 735 మందికి చికిత్స అందిస్తున్నారు.

హుబేలో ప్రయాణ ఆంక్షలు ఎత్తివేత..

అయితే.. కరోనాకు కేంద్ర బిందువైనా చైనా హుబే రాష్ట్రంలో 2నెలల అనంతరం ప్రయాణ ఆంక్షలను ఎత్తివేయడానికి అధికారులు నిర్ణయించారు. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి రాష్ట్రాన్ని వీడేందుకు అనుమతినిచ్చారు. తొలి కరోనా కేసు నమోదైన వుహాన్​లో మాత్రం ఏప్రిల్​ 8 వరకు ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

దక్షిణ కొరియాలో..

దక్షిణ కొరియాలో వైరస్​ కేసుల సంఖ్య పెరిగింది. తాజాగా 76మందికి వైరస్​ నిర్ధరణ అయ్యింది. దీనితో కేసుల సంఖ్య 9వేల 37కు చేరింది. సోమవారం 9మంది మరణించడం వల్ల మొత్తం మృతుల సంఖ్య 120కి చేరింది.

ఇదీ చూడండి: అమెరికాను వెంటాడుతున్న వెంటిలేటర్ల కొరత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.