ETV Bharat / international

కరోనా: చైనా కంటే ఇతర దేశాల్లోనే ఎక్కువ కేసులు! - Coronavirus cases emerging faster outside China: WHO

చైనాను కొన్నినెలలుగా వణికిస్తోన్న కరోనా.. ప్రపంచ దేశాలకూ కంటి నిండా కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా చైనాలో మంగళవారం నమోదైన కేసుల సంఖ్య కంటే.. ఇతర దేశాల్లోనే ఎక్కువ మందికి వైరస్​ సోకినట్లు డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది. ఇలా అకస్మాత్తుగా కేసులు పెరగడం ఆందోళన రేకెత్తిస్తోందని పేర్కొంది.

Coronavirus cases emerging faster outside China: WHO
కరోనా: చైనా కంటే ఇతర దేశాల్లోనే ఎక్కువ కేసులు!
author img

By

Published : Feb 27, 2020, 5:16 AM IST

Updated : Mar 2, 2020, 5:14 PM IST

కరోనా: చైనా కంటే ఇతర దేశాల్లోనే ఎక్కువ కేసులు!

కరోనా బారి నుంచి చైనా మెల్లగా కోలుకుంటుండగా.. మరోవైపు ఇతర దేశాల్లో వైరస్​ విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో చైనా కంటే.. ఇతర దేశాల్లో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది.

ఇటీవల ప్రపంచవ్యాప్తంగా వైరస్​ బారిన పడ్డ వారి సంఖ్య చైనాలో నమోదైన కేసులను మించిపోయిందని డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​​ టెడ్రోస్ అధనామ్​ పేర్కొన్నారు. ఒక్క మంగళవారమే చైనాలో 411 కొత్త కేసులు నమోదు కాగా.. ఇతర దేశాల్లో 427 కేసులను గుర్తించినట్లు ఐరాస ఆరోగ్య సంస్థ వివరించింది.

తాజాగా ఇటలీ, ఇరాన్​, దక్షిణ కొరియాల్లో కరోనా కేసులు పెరగడం వల్ల.. అక్కడి ప్రభుత్వాలు వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో అకస్మాత్తుగా వైరస్​ కేసులు ఎక్కువగా నమోదుకావడం ఆందోళన రేకెత్తిస్తోందని డబ్ల్యూహెచ్​ఓ వివరించింది.

చైనాలో కరోనా వల్ల ఇప్పటివరకు 2,718 మరణాలు సంభవించగా.. ప్రపంచ వ్యాప్తంగా 81వేలకు పైగా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

విరుగుడు కోసం కృషి...

మరోవైపు వైరస్​కు వ్యాక్సిన్​ కనుగొనేందుకు శాస్త్రవేత్తలు అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. కొవిడ్-​19 కారణంగా చైనాలో ఆర్థిక సంక్షోభం నెలకొంది. కర్మాగారాలు మూతపడ్డాయి. పర్యటక రంగం కూడా పూర్తిగా దెబ్బతింది. ఈ నేపథ్యంలోనే మరో ఐదునెలల్లో రానున్న టోక్యో ఒలింపిక్స్​ అనుకున్నట్లుగా జరుగుతాయా.. లేదా అనే సందేహాలు నెలకొన్నాయి.

Last Updated : Mar 2, 2020, 5:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.