పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని పీఎం నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రత్యేక సలహాదారు ఫైజల్ సుల్తాన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇమ్రాన్.. ప్రస్తుతం ఐసొలేషన్‌లో ఉన్నట్టు పేర్కొన్నారు.
కరోనా టీకా తొలి డోసు తీసుకున్న రెండు రోజులకు 67ఏళ్ల ఖాన్‌కు వైరస్ సోకిందని తేలడం గమనార్హం.
ఆర్థికంగా కుదేలైన పాక్‌ను కరోనా సంక్షోభం చిన్నాభిన్నం చేసింది. ఆ దేశంలో ఇప్పటివరుకు 6,23,135 కరోనా కేసులు నమోదయ్యాయి. 13,799 మంది కరోనాకు బలయ్యారు.
ఇదీ చూడండి: విమానం ఎక్కుతూ.. మూడు సార్లు కాలుజారిన బైడెన్