ETV Bharat / international

గాల్వన్​ లోయ ఘర్షణల్లో చైనా కమాండర్ మృతి! - వాస్తవాధీన రేఖలో ఘర్షణ

గాల్వన్​ లోయ ఘర్షణలో చైనావైపు దాదాపు 40 మంది గాయపడటం లేదా మరణించినట్లు భారత అధికారులు అంచనాకు వచ్చారు. చైనా భూభాగంలో ఆంబులెన్స్​ వాహనాలు, హెలికాప్టర్ల కదలికలు పెరిగినట్లు గుర్తించారు. మరణించినవారిలో చైనా కమాండింగ్ అధికారి ఉన్నట్లు తెలుస్తోంది.

india china face off
చైనా కమాండర్ మృతి
author img

By

Published : Jun 17, 2020, 11:39 AM IST

లద్ధాఖ్​లోని గాల్వన్​ లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణల్లో చైనా పీఎల్​ఏ కమాండింగ్ అధికారి మృతి చెందినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘర్షణల్లో భారత్​తో తలపడిన చైనా బృందానికి ఆయన కమాండర్​గా​ ఉన్నట్లు తెలుస్తోంది.

సోమవారం రాత్రి జరిగిన ఈ ఘర్షణల్లో చైనా వైపున గణనీయంగా ప్రాణనష్టం సంభవించినట్లు భారత సైనికాధికారులు గుర్తించారు. గాల్వన్​ నదికి ఆవల స్ట్రెచర్లపై తరలించిన చైనా సైనికుల సంఖ్యను బట్టి భారత అధికారులు ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

40 మంది వరకు..

గాల్వన్​ నది వెంబడి అంబులెన్స్ వాహనాలతో పాటు చైనా హెలికాప్టర్​ కదలికలు పెరిగినట్లు భారత అధికారులు గుర్తించారు. అయితే ఘర్షణలో మరణించినవారు, గాయపడ్డవారి సంఖ్యను కచ్చితంగా చెప్పలేమని సైనిక వర్గాలు తెలిపాయి. సుమారు 40 మంది వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

భారత్​-చైనా సరిహద్దు ఘర్షణకు సంబంధించి అమెరికా నిఘా విభాగం కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. ఈ ఘటనలో చైనాకు చెందిన 35 మంది జవాన్లు మృతి చెంది ఉండొచ్చని అంచనా వేసింది.

ఇదీ చూడండి: గాల్వన్​ లోయలో ఆ రాత్రి ఏం జరిగింది?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.