హాంగ్‌కాంగ్‌లో నేరస్థుల అప్పగింత బిల్లుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను అణిచివేసేందుకు చైనా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోన్నట్లు తెలుస్తోంది. పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చేందుకు సరిహద్దు వెంట భారీగా భద్రతా బలగాలను మోహరిస్తోంది డ్రాగన్. షెంజన్ సిటీ మైదానంలోకి చైనా.. పీపుల్స్ ఆర్మీ, సైనిక వాహనాల్ని పంపిందని మీడియా నివేదికల్లో స్పష్టమైంది. ఈ పరిణామాల్ని బట్టి హాంగ్‌కాంగ్ అల్లర్లలో చైనా ప్రత్యక్ష జోక్యం చేసుకునే అవకాశాలున్నాయని సమాచారం.
క్షణాల్లో పరిష్కరించగలరు..
హాంగ్‌కాంగ్ సంక్షోభంపై స్పందించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సమస్యను చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పరిష్కరించాలనుకుంటే... సత్వరమే చేయగలరని అభిప్రాయపడ్డారు. హాంగ్‌కాంగ్‌లో అశాంతి వాతావరణాన్ని రూపుమాపాలంటే అమెరికా-చైనా మధ్య స్పష్టమైన వాణిజ్య ఒప్పందం కుదరాల్సిన అవసరం ఉందని వరుస ట్వీట్లు చేశారు ట్రంప్.
-
I know President Xi of China very well. He is a great leader who very much has the respect of his people. He is also a good man in a “tough business.” I have ZERO doubt that if President Xi wants to quickly and humanely solve the Hong Kong problem, he can do it. Personal meeting?
— Donald J. Trump (@realDonaldTrump) August 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">I know President Xi of China very well. He is a great leader who very much has the respect of his people. He is also a good man in a “tough business.” I have ZERO doubt that if President Xi wants to quickly and humanely solve the Hong Kong problem, he can do it. Personal meeting?
— Donald J. Trump (@realDonaldTrump) August 14, 2019I know President Xi of China very well. He is a great leader who very much has the respect of his people. He is also a good man in a “tough business.” I have ZERO doubt that if President Xi wants to quickly and humanely solve the Hong Kong problem, he can do it. Personal meeting?
— Donald J. Trump (@realDonaldTrump) August 14, 2019
''హాంగ్‌కాంగ్ సమస్యను వేగంగా, మానవత్వంతో పరిష్కరించాలని అధ్యక్షుడు షీ అనుకుంటే.. ఆయన కచ్చితంగా చేయగలరు. దీనిపై నాకెలాంటి సందేహం లేదు. వ్యక్తిగతంగా సమావేశమవ్వగలరా?''
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
అట్టుడుకుతున్న హాంగ్‌కాంగ్...
నేరస్థుల అప్పగింత బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలతో హాంగ్‌కాంగ్ అట్టుడుకుతోంది. చైనా జోక్యాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్యవాదులు చేస్తున్న ఆందోళనలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. వేల మంది నిరసనకారులు అంతర్జాతీయ విమానాశ్రయంలోకి చొచ్చుకెళ్లారు. సోమవారం నుంచి హాంగ్‌కాంగ్‌లో విమాన సేవలు నిలిచిపోయాయి. అన్ని కార్యకలాపాలు స్తంభించాయి.