ETV Bharat / international

కుటుంబ నియంత్రణ పాటించని జంటకు రూ.3 కోట్లు ఫైన్!

కుటుంబ నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఏకంగా 8 మంది సంతానానికి జన్మనిచ్చాడు ఓ రైతు. ఈ నేపథ్యంలో ఆయనపై రూ. 3 కోట్లు జరిమానా​ విధించింది ప్రభుత్వం.

author img

By

Published : Jul 9, 2021, 5:39 AM IST

china
చైనా, కుటుంబ నియంత్రణ

కుటుంబ నియంత్రణ పాటించని ఓ జంటకు చైనా ప్రభుత్వం ఏకంగా రూ.3 కోట్ల జరిమానా విధించింది. ఆ తర్వాత జరిమానాను రూ.10 లక్షలకు తగ్గించింది. కుటుంబ నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ 50 ఏళ్ల వయసున్న ఓ రైతు ఇప్పటి వరకు 8 మంది సంతానానికి జన్మనిచ్చాడు. ఇద్దరు అబ్బాయిలు పుట్టే వరకు అతడు కుటుంబ నియంత్రణ పాటించలేదు. అతడికి మొదటి భార్య ద్వారా అయిదుగురు అమ్మాయిలు జన్మించారు. అనంతరం అమెకు విడాకులిచ్చి మరో మహిళను పెళ్లాడాడు. రెండో భార్యకు ఇద్దరు అబ్బాయిలు, ఒక పాప పుట్టారు.

అయితే పిల్లలందర్నీ పోషించేందుకు అతడి ఆర్థిక స్తోమత సరిపోకపోవడంతో ఆ అమ్మాయిని వేరొక కుటుంబానికి దత్తత ఇచ్చాడు. ఇద్దరికి మించి సంతానాన్ని కనకూడదనే చట్టం చైనాలో దశాబ్దాలుగా అమల్లో ఉంది. ముగ్గురు సంతానం కలిగి ఉండేందుకు అనుమతిస్తూ చైనా ప్రభుత్వం ఆ చట్టాన్ని ఇటీవల సవరించింది. అయితే, అధిక సంతానం నిబంధన ఉల్లంఘించిన రైతుకు అక్కడి ప్రభుత్వం రూ. 3 కోట్లు జరిమానా విధించింది. అయితే ఆ మొత్తం కట్టే స్థోమత లేదని చెప్పడంతో అతడి దీన స్థితి చూసి రూ. 10 లక్షలకు ఆ జరిమానాను తగ్గించారు.

ఇదీ చదవండి:నింగిలోకి చైనా అధునాతన ఉపగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.