ETV Bharat / international

అమెరికాలో చైనా ప్రత్యక్ష పెట్టుబడుల్లో భారీ క్షీణత - trade war

అమెరికాలో చైనా ప్రత్యక్ష పెట్టుబడులు రికార్డ్​ స్థాయిలో క్షీణించినట్లు ఓ నివేదిక వెల్లడించింది. 2009 ఆర్థిక మాంద్యం తర్వాత 2019లోనే కనిష్ఠానికి పడిపోయినట్లు స్పష్టం చేసింది. ఈ ఏడాది కూడా జనవరి-మార్పి మధ్య అమెరికాలో చైనా ప్రత్యక్ష పెట్టుబడులు సుమారు 200 మిలియన్​ డాలర్లు తగ్గాయని తెలిపింది.

Chinese investment in US
అమెరికాలో చైనా ప్రత్యక్ష పెట్టుబడుల్లో రికార్డ్​ క్షీణత
author img

By

Published : May 11, 2020, 1:31 PM IST

ప్రపంచంలో అమెరికా, చైనాలు రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు. వాటి మధ్య వాణిజ్యం, పెట్టుబడులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అయితే.. 2009లో వచ్చిన ఆర్థిక మాంద్యం తర్వాత గత ఏడాది అమెరికాలో చైనా ప్రత్యక్ష పెట్టుబడులు రికార్డ్​ స్థాయిలో క్షీణించినట్లు ఓ నివేదిక తేల్చింది. కరోనాతో ప్రపంచ దేశాల మధ్య వాణిజ్యం నిలిచిపోవడానికి ముందే.. ఈ స్థాయిలో పెట్టుబడులు తగ్గిపోవటం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు, విదేశాల్లో పెట్టుబడులపై చైనా ఆంక్షలను ప్రతిబింబిస్తోందని తెలిపింది.

అమెరికా-చైనా సంబంధాల జాతీయ కమిటీ, రోడియం సలహా బృందం సంయుక్తంగా నివేదిక రూపొందించింది.

" అమెరికాలో చైనా పెట్టుబడులు 2018 (5.4 బిలియన్​ డాలర్లు)తో పోలిస్తే 2019లో 5 బిలియన్​ డాలర్లకు తగ్గిపోయాయి. 2009 మాంద్యం తర్వాత ఇదే కనిష్ఠం. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ఈ కారణంగా ఈ ఏడాది జనవరి-మార్పి మధ్య అమెరికాలో చైనా ప్రత్యక్ష పెట్టుబడులు సుమారు 200 మిలియన్​ డాలర్లు తుడిచిపెట్టుకుపోయాయి."

- నివేదిక

అమెరికా పెట్టుబడుల్లో వృద్ధి

మరోవైపు.. చైనాలో అమెరికా పెట్టుబడులు 2018 (12 బిలియన్​ డాలర్లు)తో పోలిస్తే గత ఏడాది 14 బిలియన్​ డాలర్లకు పెరిగిందని తెలిపింది. షాంఘైలోని టెస్లా ప్రాజెక్టు సహా గతంలో ప్రకటించిన ప్రాజెక్టులతోనే ఈ పెరుగుదల నమోదైనట్లు వివరించింది. అయితే.. రెండు వైపుల పెట్టుబడులు ఏడేళ్ల కనిష్ఠానికి పడిపోయినట్లు తేల్చింది.

అమెరికా సాంకేతికతను చైనా అక్రమంగా పొందేందుకు ప్రయత్నిస్తుందనే భయాలతో ఆ దేశ పెట్టుబడులపై అగ్రరాజ్య అధికారులు కఠినంగా వ్యవహరించటమే ఇందుకు కారణంగా పేర్కొంది నివేదిక.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.