ETV Bharat / international

నేపాల్ రాజకీయాల్లో చైనా జోక్యం.. ఓలి కోసమే!

నేపాల్​ రాజకీయాల్లో చైనా మరోసారి తలదూర్చుతోంది. తనకు అనుకూలంగా వ్యవహరించే ప్రధాని ఓలిపై రాజీనామా ఒత్తిడి పెరిగిపోవడం వల్ల రంగంలోకి దిగి మంతనాలు జరుపుతోంది. సీనియర్ నేతలతో చైనా రాయబారి గత రెండురోజులుగా ముమ్మర సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు అంతర్గత వ్యవహారాల్లో చైనా జోక్యం చేసుకోవడంపై నేపాల్ రాజకీయ నేతలు మండిపడుతున్నారు.

Chinese envoy meets senior NCP leaders
నేపాల్ రాజకీయాల్లో డ్రాగన్ జోక్యం- ఓలి కోసమే!
author img

By

Published : Jul 7, 2020, 6:33 PM IST

నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలిపై రాజీనామా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో చైనా ఆ దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటోంది. అధికార పార్టీ నేతలతో మంతనాలు జరుపుతోంది.

ఈ మేరకు ఓలిని గట్టెక్కించడానికి చైనా రాయబారి హౌ యాంకీ నేపాల్ కమ్యునిస్టు పార్టీ నేతలతో చర్చలు ముమ్మరం చేశారు. మాజీ ప్రధానులు మాధవ్ కుమార్ నేపాల్, జలనాథ్ ఖనాల్ సహా గత 48 గంటల్లో పలువురు సీనియర్ నేతలను కలిశారు. మాధవ్ కుమార్, జలనాథ్​లు​ చైనా రాయబారితో సమావేశమైన విషయాన్ని సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి.

Chinese envoy meets senior NCP leaders amid growing rift within Nepal's ruling party
హౌ యాంకీ, చైనా రాయబారి

ఖనాల్​తో గురువారం 45 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో.. అధికార పార్టీలో తలెత్తిన వివాదాలపై హౌ ఆందోళన వ్యక్తం చేశారు. విభేధాలను పరిష్కరించుకునే దిశగా పనిచేయాలని సూచించారు. ఎన్​సీపీ నేత, మాజీ ప్రధాని మాధవ్ కుమార్ నేపాల్​తో ఆదివారం సమావేశమయ్యారు హౌ. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు. ఆమెను అదేరోజు నేపాల్​ అధ్యక్షురాలు విద్యా దేవీ భండారీ సైతం ఆహ్వానించారు.

అధికారం కోసం పార్టీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పుష్ప కమల్ దహాల్ 'ప్రచండ' నేతృత్వంలోని అసమ్మతి వర్గానికి, ప్రధాని ఓలికి మధ్య అంతర్గతంగా అభిప్రాయభేదాలు పెరిగిపోయిన సమయంలో చైనా ఈ తరహా చర్చలు సాగించడం ఆసక్తికరంగా మారింది.

'మేం వ్యతిరేకం'

నేపాల్ అంతర్గత రాజకీయాల్లో చైనా ఇలా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడాన్ని చాలా మంది రాజకీయ నాయకులు తప్పుబడుతున్నారు.

'రిమోట్ కంట్రోల్​తో నడిచే ప్రజాస్వామ్యం నేపాల్ ప్రజలకు ప్రయోజనం కలిగిస్తుందా?' అని నేపాల్ మాజీ విదేశాంగ మంత్రి, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ నేత.. ప్రభుత్వాన్ని నిలదీశారు.

"ఈ రోజు కూడా మన దేశంలోని అంతర్గత రాజకీయాలను విదేశీ శక్తులు నడిపించే కుట్ర సిద్ధాంతాలను తీవ్రంగా ఖండిస్తున్నాను. సార్వభౌమత్వం కలిగిన దేశంగా నేపాల్ తన నిర్ణయాలను స్వయంగా తీసుకోగలదు. మా వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ధోరణిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం."

-నారాయణ్​కాజీ శ్రేష్ఠ, కమ్యునిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ ప్రతినిధి

కొత్తేం కాదు.

సంక్షోభ సమయాల్లో నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో చైనా రాయబారి జోక్యం చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. నెలన్నర క్రితం ఎన్​సీపీ అంతర్గత వైరం తారస్థాయికి చేరినప్పుడు ప్రధాని ఓలి, అధ్యక్షురాలు భండారీలతో విడిగా చర్చలు జరిపారు. ప్రచండ, మాధవ్ నేపాల్ వంటి సీనియర్ నేత​లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఓలి, ప్రచండ చర్చలు

బుధవారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో ప్రధాని ఓలి, ప్రచండతో చర్చల్లో పాల్గొన్నారు. ప్రధాని నివాసంలో మంగళవారం జరిగిన ఈ సమావేశంలో ఇరువురి మధ్య ఏర్పడిన అభిప్రాయభేదాలకు పరిష్కారం దిశగా సమాలోచనలు జరిపారు. అయితే పరిష్కారం విషయంలో ఎలాంటి పురోగతి లభించలేదని ప్రధాని ఓలి ప్రెస్ అడ్వైజర్ సూర్య థాపా వెల్లడించారు.

ఈ నేపథ్యంలో బుధవారం జరగనున్న స్టాండింగ్ కమిటీ సమావేశాలు ప్రధాని ఓలి సహా ఎన్​సీపీకి కీలకం కానున్నాయి. ఓలి, ప్రచండ మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశాలు ఇప్పటివరకు మూడుసార్లు వాయిదాపడ్డాయి. వీరిద్దరు తమ డిమాండ్ల విషయంలో వెనక్కితగ్గకపోవడం వల్ల చర్చలు అపరిష్కృతంగానే మారాయి.

వివాదం

పార్లమెంట్ బడ్జెట్ సమవేశాలను ఓలి ఏకపక్షంగా రద్దు చేయడం వల్ల ఇరువర్గాల మధ్య అలకలు పెరిగిపోయాయి. ప్రచండ, ఓలి వర్గాలుగా పార్టీ అంతర్గతంగా చీలిపోయింది. సీనియర్ నేతలంతా ప్రచండకు మద్దతుగా ఉన్నారు. ఓలి రాజీనామా చేయాలని పట్టుబడుతున్నారు. మరోవైపు తనను ప్రధాని పదవి నుంచి దించేయాలని ప్రయత్నాలు చేస్తోందని భారత్​పై ఆరోపణలు చేశారు ఓలి. కాగా.. ఈ ఆరోపణలపై పార్టీ వర్గాలే మండిపడ్డాయి.

ఇదీ చదవండి- తుది దశకు చైనా వ్యాక్సిన్ ట్రయల్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.