చంద్రుడి ఉపరితలంపై నమూనాల సేకరణకు వెళ్లిన చైనా మిషన్ చాంగే-5 క్యాప్సూల్.. ఆ నమూనాలతో భూమి మీదకు పయనాన్ని మొదలుపెట్టింది. డిసెంబర్ మొదట్లో చంద్రుడిపై 2 కిలోల బరువైన నమూనాలు సేకరించి.. అక్కడ డ్రాగన్ జెండాను పాతిన క్యాప్సూల్ అనంతరం తిరిగి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఆ తర్వాత కొద్ది రోజులపాటు చంద్రుడి కక్ష్యలోనే పరిభ్రమించిన క్యాప్సూల్.. తిరిగి భూమికి తన ప్రయాణం ప్రారంభించింది.
ముడు రోజుల సమయం..
చైనీస్ క్యాప్సూల్ భూమికి చేరుకునేందుకు మూడు రోజుల సమయం పడుతుందని చైనా రోదసీ సంస్థ తెలిపింది. ఆ క్యాప్సూల్ ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో దిగనుంది.
1976లో సోవియట్ యూనియన్ చేపట్టిన లూనార్ ప్రోబ్ తర్వాత ఇన్నేళ్లకు.. చంద్రుడి నమూనాలు భూమి మీదకు వస్తున్నాయి.
ఇదీ చూడండి: మరో కీలక ఘట్టం పూర్తి- 'చాంగే-5' తిరుగుప్రయాణం