ETV Bharat / international

ఆ ఒక్క నిర్ణయం విలువ కొన్ని లక్షల ప్రాణాలు! - చైనా కరోనా

వుహాన్​.. కరోనా కేంద్రబిందువు. ఇప్పుడు ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న వైరస్​కు పుట్టినిల్లు​. అయితే వుహాన్​ను మూసివేయడం వల్ల.. ఇతర ప్రాంతాలకు వైరస్​ సోకడం మూడు రోజులు ఆలస్యమైందని ఓ నివేదిక తెలిపింది. ఫలితంగా దాదాపు 2,02,000 కేసులు తగ్గాయని పేర్కొంది.

China's move to lockdown Wuhan
కరోనా కట్టడికి వుహాన్​ నగరం మూసివేత
author img

By

Published : Mar 15, 2020, 9:22 AM IST

కరోనా వైరస్​కు అడ్డుకట్ట వేయడంలో చైనా విఫలమైందని ఆ దేశాధ్యక్షుడు జిన్​పింగ్​పై ప్రపంచ దేశాలు ఆరోపణలు చేశాయి. అయితే.. చైనా తీసుకున్న ఒక్క కీలక నిర్ణయంతో అనేక మంది ప్రాణాలు కాపాడినట్టు ఓ నివేదిక తెలిపింది. అదే 'వుహాన్​ షట్​డౌన్.'​

వైరస్​ కేంద్రబిందువైన వుహాన్​ నగరాన్ని జనవరి 23న చైనా మూసివేసింది. దీని వల్ల వుహాన్​ పరిసర ప్రాంతాలకు వైరస్​ పాకడం మూడు రోజుల పాటు ఆలస్యమైందని ఆ నివేదిక పేర్కొంది. ఫలితంగా ఇతర ప్రాంతాల్లోని ప్రజలు స్పందించడానికి తగిన సమయం లభించిందని స్పష్టం చేసింది.

చైనా, అమెరికా, బ్రిటన్​కు చెందిన 15 విశ్వవిద్యాలయాల్లోని 22 మంది శాస్త్రవేత్తలు చైనాలో పరిశోధనలు చేపట్టారు. వుహాన్​ మూసివేత వల్ల సుమారు 2,02,000 కేసులు తగ్గాయని వెల్లడించారు. ఈ నివేదిక చైనా అధికారిక వార్తా పత్రిక 'చైనా డైలీ'లో ప్రచురితమైంది.

వుహాన్​లో ప్రయాణాలపై నిషేధం వల్ల ఇతర నగరాలకు కొవిడ్​-19 వ్యాప్తి సగటున 2.91 రోజులు ఆలస్యమైనట్టు నివేదిక పేర్కొంది. దీని ద్వారా సుమారు 130కిపైగా నగరాలు, చైనాలోని సగం భూభాగానికి లబ్ధి చేకూరినట్లు వివరించింది. ప్రయాణాలపై ఆంక్షలతో పాటు ఇతర చర్యలు వైరస్​ వ్యాప్తిని తగ్గించేందుకు ఉపయోగపడినట్లు పరిశోధకులు గుర్తించారు.

2019 డిసెంబర్​లో కరోనా వైరస్​ పుట్టుకొచ్చింది. వైరస్​ నేపథ్యంలో.. హుబే రాష్ట్రం, దాని రాజధాని వుహాన్​పై కఠిన చర్యలు చేపట్టింది చైనా. సుమారు 5 కోట్ల మందిని నిర్బంధంలో ఉంచి వైద్యం అందిస్తోంది. వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకున్న చర్యల్లో ప్రయాణ ఆంక్షలు, అనుమానిత, పాజిటివ్​ కేసులను నిర్బంధించటం, పాఠశాలలు, వినోద రంగ వేదికల మూసివేత, సామూహిక కార్యక్రమాలపై నిషేధం, ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించటం వంటి అంశాలు ఉన్నాయి. ఈ చర్యలను ప్రపంచ ఆరోగ్య సంస్థ అభినందించింది.

అయితే.. తొలి కేసు విషయంలో సందిగ్ధత నెలకొంది. డిసెంబర్​లో తొలి కేసు నమోదైందని భావిస్తుంటే.. అంతకు ముందు నవంబర్​ 17నే వైరస్​కు సంబంధించిన ఓ కేసును గుర్తించినట్టు దక్షిణ చైనా మార్నింగ్​ పోస్ట్​లో మరో నివేదిక ప్రచురితమైంది.

2019, డిసెంబర్​ 31 నాటికి 266 కేసులు నమోదయ్యాయి. 2020, జనవరి 1కి అవి 381కి చేరాయి.

28 రోజుల్లోనే 262 నగరాలకు..

అయితే.. జనవరి 11 నుంచి వుహాన్​ను మూసివేసేంత వరకు సుమారు 4.3 మిలియన్ల​ మంది నగరం నుంచి ఇతర ప్రాంతాలకు పయనమైనట్టు తెలుస్తోంది. ఫలితంగా.. కేవలం 28 రోజుల వ్యవధిలోనే 262 నగరాలకు వ్యాప్తి చెంది, కొత్త కేసులు నమోదవడం ప్రారంభమయ్యాయని మరో పరిశోధన పేర్కొంది. 2009లో వచ్చిన హెచ్​1ఎన్​1 ఫ్లూ.. అవే నగరాలకు వ్యాపించేందుకు 132 రోజులు పట్టినట్లు గుర్తుచేసింది.

ప్రస్తుతం ఇలా...

వుహాన్​లో వైరస్​ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. శనివారం 13 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 3,189గా ఉంది. చైనాలో ఇప్పటి వరకు వైరస్​ బారిన పడిన వారి సంఖ్య 80,824కు చేరినట్లు ఆ దేశా ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇదీ చూడండి: లక్షణాలు తెలిసే లోపే వేగంగా కరోనా వ్యాప్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.