ETV Bharat / international

లక్షణాలు తెలిసే లోపే వేగంగా కరోనా వ్యాప్తి - కరోనా మహమ్మారి

వైరస్​ లక్షణాలు బయటపడే లోపే కరోనా ఇతరులకు సోకుతుందని ఓ పరిశోధన వెల్లడించింది. చైనాలో ఒకరి నుంచి ఒకరికి వైరస్ వ్యాప్తికి పట్టే సమయం సగటున నాలుగు రోజులుగా తేల్చింది. ఈ నేపథ్యంలో నివారణ చర్యలు చేపట్టడం మరితం కష్టంగా మారాయని పేర్కొంది.

Coronavirus spreads quickly
లక్షణాలు తెలిసే లోపే వేగంగా కరోనా వ్యాప్తి
author img

By

Published : Mar 14, 2020, 7:10 PM IST

కరోనా మహమ్మారి ఒకరి నుంచి ఒకరికి సోకేందుకు తీసుకుంటున్న సమయం.. వారంకన్నా తక్కువేనని పరిశోధకులు వెల్లడించారు. కరోనా వైరస్​ సోకిన వ్యక్తికి లక్షణాలు బయటపడే లోపే సుమారు 10 శాతం మంది దాని ప్రభావానికి గురవుతున్నారని స్పష్టం చేశారు. వైరస్​ను కట్టడి చేయడానికి ఈ పరిశోధన.. ఆరోగ్య అధికారులకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.

వైరస్​పై తాజా పరిశోధన.. 'ఎమర్జింగ్​ ఇన్​ఫెక్షియస్​ డిసీజెస్​' జర్నల్​లో ప్రచురితమైంది. ఇద్దరు వ్యక్తుల్లో ఒకరి నుంచి ఒకరికి ఈ వైరస్​ సోకినప్పుడు.. వారిలో లక్షణాలు బయటపడే సమయాన్ని లెక్కించారు పరిశోధకులు.

రెండు అంశాలు..

చైనాలో కరోనా వ్యాప్తికి పట్టే సమయం సగటున నాలుగు రోజులుగా తేల్చారు టెక్సాస్​ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు. ఒక్కో కేసుతో ఎంత మంది ప్రభావితమవుతున్నారు, ఎక్కువ మందికి సోకేందుకు ఎంత సమయం పడుతుందనే రెండు అంశాల ఆధారంగా వైరస్​ వ్యాప్తి వేగాన్ని కనిపెట్టినట్లు పేర్కొన్నారు.​

కొవిడ్​-19 వేగంగా వ్యాప్తి చెందుతోన్న కారణంగా దానిని అడ్డుకోవడం మరింత కష్టతరంగా మారిందని తెలిపారు నివేదిక సహ రచయిత లారెన్​ అన్సెల్​ మేయర్స్​.

"ఎబోలా.. వ్యాప్తికి కొన్ని వారాలు పట్టింది. దానిని అరికట్టేందుకు ఆరోగ్య అధికారులకు సమయం దొరికింది. స్వైన్​ ఫ్లూ మాదిరిగానే కరోనా వైరస్​ వేగంగా వ్యాప్తి చెందుతోందని పరిశోధన సమాచారం చెబుతోంది. అందువల్ల మనం వేగంగా చర్యలు చేపట్టి.. పెరుగుతున్న ముప్పును అరికట్టాలి. ఈ ఆధారాలు నివారణ చర్యలు చేపట్టేందుకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా నిర్బంధంలో ఉంచటం, పాఠశాలల మూసివేత, రవాణా ఆంక్షలు, సామూహిక కార్యక్రమాల రద్దు చర్యలు చేపట్టాలి. "

- లారెన్​ అన్సెల్​ మేయర్స్​, నివేదిక సహ రచయిత

93 నగరాలపై పరిశోధన..

కరోనాకు కేంద్ర బిందువైన చైనాలో 93 నగరాలకు చెందిన 450 మంది వైరస్​ బాధితులపై పరిశోధన చేశారు శాస్త్రవేత్తలు. వైరస్​ లక్షణాలు బయటపడని వారు ఈ మహమ్మారి వ్యాప్తికి కారణమవుతున్నారని ఆధారాలను కనుక్కొన్నారు.

వైరస్​ బారిన పడిన పది మందిలో ఒకరికన్నా ఎక్కువ మంది.. వ్యాధి సోకినట్లు గుర్తించలేకపోతున్నారని తెలిపారు.

ఇదీ చూడండి: జర జాగ్రత్త: దేశంలో విస్తరిస్తోన్న కరోనా వైరస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.