టిబెట్‌లోని యార్లుంగ్ జాంగ్బోర్ నదిపై వాస్తవాదీన రేఖ సమీపంలో చైనా చేపడుతున్న సూపర్ డ్యాం నిర్మాణంపై ఆందోళన వ్యక్తం చేశారు ప్రముఖ హైడ్రోజియోలజిస్ట్ రితేశ్ ఆచార్య. ఈ ఆనకట్ట ద్వారా నీటిపై ఆధిపత్యం సాధించి, దానిని భారత్‌కు వ్యతిరేక ఆయుధంగా వాడాలని చైనా కుట్ర పన్నుతోందని చెప్పారు. సూపర్ డ్యాంతో ఈశాన్య భారత నీటి భద్రతపై ప్రభావం పడుతుందని హెచ్చరించారు.
"అంతర్జాతీయ నదుల పరంగా భారత్ కన్నా చైనాకు అనుకూల పరిస్థితులున్నాయి. విద్యుత్ ఉత్పత్తి, సాగు కోసం ఆనకట్టలు కడుతున్నట్లు చైనా చెబుతోంది. వాస్తవానికి.. నీటిని నియంత్రించి, భారత్‌పై ఆయుధంగా వాడాలనుకుంటోంది."
-రితేశ్ ఆచార్య, హైడ్రోజియోలజిస్ట్
టిబెట్‌లో ఆవిర్భవించిన యార్లుంగ్. అరుణాచల్ ప్రదేశ్‌లో సియాంగ్‌గా.. అసోంలో బ్రహ్మపుత్రగా.. పారి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. చైనాలోని త్రీ జార్జెస్ డ్యాం.. ప్రపంచంలోనే అతిపెద్ద పవర్ స్టేషన్. దానికి మూడింతల సామర్థ్యంతో ఈ సూపర్ డ్యాంను నిర్మించాలని డ్రాగన్ ప్రణాళిక రచిస్తోంది.
ఇదీ చూడండి: చైనా హై జంప్- క్యూ1లో 18.3% వృద్ధి రేటు!