ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని లెక్కచేయకుండా దురాక్రమణతో అఫ్గానిస్థాన్‌ను చేజిక్కించుకున్న తాలిబన్లతో చైనా దౌత్య సంబంధాలు(taliban china connection) ఏర్పాటు చేసుకుంది! ఈ మేరకు కాబుల్‌లో తొలి దౌత్యపరమైన సంప్రదింపులు చేపట్టింది. ఇరువురి మధ్య 'ఎలాంటి అవరోధం లేకుండా సమర్థవంతమైన సంభాషణ' జరుగుతోందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ వెల్లడించారు.
"కీలకమైన విషయాలు చర్చించేందుకు సాధారణంగానే అఫ్గానిస్థాన్ ఓ ముఖ్యమైన వేదిక. అఫ్గాన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను... తమ భవిష్యత్ విషయంలో అఫ్గాన్ ప్రజలు తీసుకున్న స్వతంత్ర నిర్ణయాన్ని చైనా ఎల్లప్పుడూ గౌరవిస్తుంది. అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉంటే నిబంధనను పాటిస్తుంది. మంచి పొరుగుదేశంతో ఉండే సంబంధాలను అఫ్గానిస్థాన్‌తో అభివృద్ధి చేసుకోవాలని అనుకుంటున్నాం. స్నేహపూర్వక సంబంధాల ద్వారా అఫ్గాన్ అభివృద్ధిలో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తాం."
-వాంగ్ వెన్బిన్, చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి
తాలిబన్ల విషయంలో తొలి నుంచీ చైనా అనుకూల వైఖరే(taliban china support) అవలంబిస్తోంది. సాయుధులు అఫ్గాన్‌ను ఆక్రమించుకున్నప్పటికీ.. ఆ దేశంలోని రాయబార కార్యాలయాన్ని చైనా మూసేయలేదు. అటు, తాలిబన్లు సైతం అఫ్గాన్ పునర్నిర్మాణంలో చైనా కీలక పాత్ర పోషించగలదని బహిరంగంగా వ్యాఖ్యానించారు.
గత నెలలోనే తాలిబన్ కీలక నేత ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్‌తో.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సమావేశమయ్యారు. షింజియాంగ్‌లోని వీగర్ ముస్లిం ఉగ్రవాద బృందాలతో(taliban china uyghur) సంబంధాలు పెట్టుకోవద్దని స్పష్టం చేశారు. వారికి సహకారం అందించబోమని బరాదర్ హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఇదీ చదవండి: 'అఫ్గాన్' ఊరిస్తున్నా.. చైనాకు అందని ద్రాక్షే!
'సరిహద్దులు మూసేయొద్దు'
ఇదిలా ఉంటే, తాలిబన్లకు బ్రిటన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అఫ్గాన్‌ను ప్రపంచం నుంచి తస్కరించే ప్రయత్నాలను మానుకోవాలని హెచ్చరించింది. దేశ సరిహద్దులను తెరిచే ఉంచాలని స్పష్టం చేసింది. దేశాన్ని మూసేయాలని ప్రయత్నిస్తే.. శరణార్థుల సంక్షోభం తలెత్తుతుందని తెలిపింది.
విదేశీ దళాలు అఫ్గాన్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత.. శరణార్థులు సరిహద్దులు దాటి ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉందని బ్రిటన్ విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ పేర్కొన్నారు. అఫ్గానిస్థాన్‌కు విస్తారమైన సరిహద్దులు ఉన్నాయని, అలాంటి దేశాన్ని మూసేయాలన్న ప్రయత్నాలు విఫలమవుతాయని చెప్పారు.
ఇదీ చదవండి: