ETV Bharat / international

భారత్​పై చైనా మరో కుట్ర- ఉగ్రవాదులకు ఆయుధ సాయం - అరకన్ ఆర్మీ

భారత్​ను ఎదుర్కొనేందుకు చైనా వీలైనన్ని వక్రమార్గాలు వెతుకుతోంది. భారతదేశాన్ని బలహీనపర్చడానికి మయన్మార్​లోని ఉగ్రవాదులకు మద్దతు ఇస్తోంది. నిధులతో పాటు అధునాతన ఆయుధాలను సమకూర్చుతోంది. తనకు అనుకూలమైన ప్రయోజనాలను నెరవేర్చుకోవడం సహా ప్రభుత్వాలను బెదిరించడానికి ఈ ఉగ్రసంస్థలను వాడుకుంటోంది.

China supplying weapons to Arakan Army armed group to weaken India, Myanmar: Report
భారత్​పై చైనా మరో కుట్ర- ఉగ్రవాదులకు ఆయుధ సాయం
author img

By

Published : Jul 2, 2020, 3:17 PM IST

Updated : Jul 2, 2020, 6:30 PM IST

భారత్​తో ప్రత్యక్షంగా తలపడి కంగుతిన్న పొరుగుదేశం చైనా ఇప్పుడు అడ్డదారులు తొక్కుతోంది. వక్రమార్గంలో భారత్​ను దెబ్బకొట్టాలని కుట్రలు పన్నుతోంది. మయన్మార్​లోని ఉగ్రవాదులకు అండగా నిలుస్తోంది. ఈ మేరకు మయన్మార్​లోని ఉగ్రవాద సంస్థ 'అరకన్ ఆర్మీ'కి నిధులు, అధునాతన ఆయుధాలను చైనా సమకూర్చుతోందని మయన్మార్ వార్తా సంస్థ లికాస్ న్యూస్ వెల్లడించింది.

అరకన్ ఆర్మీకి వచ్చే నిధుల్లో 95 శాతం చైనా నుంచే వస్తున్నట్లు ఆగ్నేయాసియా దేశాల సైనిక నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా అధునాతన క్షిపణులు సైతం అరకన్ వద్ద ఉన్నట్లు తెలిపారు. భూతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే మ్యాన్​పాడ్స్​(మ్యాన్ పోర్టబుల్ ఎయిర్​ డిఫెన్స్ సిస్టమ్) క్షిపణులు ఈ సంస్థ వద్ద ఉన్నట్లు స్పష్టం చేశారు.

భారీగా ఆయుధ సరఫరా

ఇటీవల భారీ ఎత్తున ఆయుధాలను అరకన్ ఆర్మీకి చైనా సరఫరా చేసినట్లు ఈస్టర్న్ లింక్​లో వచ్చిన కథనంలో సుబిర్ భౌమిక్​ అనే నిపుణులు వెల్లడించారు. 500 అసాల్ట్ రైఫిళ్లు, 30 యూనివర్సల్ మెషీన్ గన్స్, 70 వేల రౌండ్ల తూటాలు, భారీగా గ్రెనేడ్లను అందించినట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరిలో సముద్రమార్గం ద్వారా మొనఖాలి బీచ్ వరకు వీటిని తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇందులో చైనాకు చెందిన ఎఫ్​ఎన్-6 మ్యాన్​ప్యాడ్లు కూడా ఉన్నట్లు స్పష్టం చేశారు.

"అరకన్ ఆర్మీతో పాటు మయన్మార్​లో ఉన్న ఏడు గ్రూపులు చైనా నుంచి ఆయుధాలు ఇతర సహాయం పొందాయి. మయన్మార్ పశ్చిమ భాగాన్ని ఆ దేశం నుంచి వేరు చేయడమే చైనా లక్ష్యం. మయన్మార్​ను బలహీనం చేయాలని చైనా ప్రయత్నిస్తోంది."

-స్థానిక దౌత్యవేత్త

చైనా మద్దతుకు కారణం?

అరకన్ ఆర్మీకి ఆయుధాలు, నిధులు అందజేయడం ద్వారా భారత్, మయన్మార్​పై పట్టు సాధించాలని చైనా అనుకుంటోంది. చైనా తన దక్షిణ సరిహద్దువైపు మరింత పట్టు సాధించాలని ఉగ్రవాదులకు నిధులు అందజేస్తోందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

"అరకన్ ఆర్మీకి మద్దతు ఇవ్వడం వెనక చైనా వ్యూహం ఉంది. మయన్మార్​ పశ్చిమ భూభాగంతో పాటు భారత్ మయన్మార్ సరిహద్దులో తన ప్రాబల్యాన్ని విస్తరించుకోవాలని భావిస్తోంది."

-సంబంధిత వర్గాలు

'మయన్మార్​లో భారత్​ ప్రభావం పెరగకూడదని చైనా భావిస్తోంది. మయన్మార్ విషయంలో గుత్తాధిపత్యం సాధించాలని కోరుకుంటోంది' అని నిపుణులు చెబుతున్నారు.

"దక్షిణాసియాలో చైనా బహు ముఖ వ్యూహాలు రచిస్తోంది. భారత్​ను బలహీనపరచాలని చైనా అనుకుంటోంది. ఇప్పటికే పాకిస్థాన్​తో భారత్​ యుద్ధం చేస్తోంది. ఇప్పుడు కొత్తగా మయన్మార్​తో శత్రుత్వం పెట్టుకోవాలని భారత్ అనుకోవడం లేదు."

-ఆస్ట్రేలియాకు చెందిన విశ్లేషకులు

భారత్​కు వ్యతిరేకంగా...!

మయన్మార్​లో భారత్​ చేపట్టిన నిర్మాణాలను అడ్డుకోవడంలో చైనా సహాయం పొందుతున్న అరకన్ ఆర్మీ పాత్ర ఉంది. 2017లో మయన్మార్ ప్రభుత్వం 220 మిలియన్ డాలర్ల విలువైన రోడ్డు నిర్మాణ పనులను దిల్లీలోని సీ&సీ కన్​స్ట్రక్షన్స్​కు అప్పగించింది. దీనికి సంబంధించిన పూర్తి అనుమతులు 2018 జనవరిలో వచ్చాయి. నిర్మాణ పనులు కొనసాగుతున్న సమయంలో అక్కడి సిబ్బందిని అరకన్ ఆర్మీ కిడ్నాప్ చేసింది. ఆ ప్రాంతంలోని వాహనాలు, నిర్మాణ సామగ్రిని ధ్వంసం చేసింది. అపహరణకు గురైన వారిలో ఇద్దరు భారత పౌరులు, అగ్నిమాపక సిబ్బందితో పాటు మయన్మార్​కు చెందిన పార్లమెట్ సభ్యుడు కూడా ఉన్నారు.

అసలు ఏంటీ అరకన్ ఆర్మీ?

మయన్మార్​లోని రాఖైన్ రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద తిరుగుబాటు దళమే ఈ అరకన్ ఆర్మీ. ఇది అక్కడి యునైటెడ్ లీగ్ ఆఫ్ అరకన్(యూఎల్) అనే రాజకీయ పార్టీకి చెందిన సాయుధ విభాగం. ఈశాన్య భారతదేశం నుంచి మయన్మార్​లోని చిన్​, రాఖైన్ రాష్ట్రాల గుండా హిందూ మహాసముద్రం వరకు అరకన్ ఆర్మీ పనిచేస్తుంది.

మార్చి 23న ఈ దళాన్ని మయన్మార్ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. భయోత్పాతాలు సృష్టించి దేశంలోని పౌరులు, ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతోందని పేర్కొంది.

చైనా మద్దతు

అరకన్ ఆర్మీ 2019లో నాలుగు పోలీస్ స్టేషన్లపై దాడి చేసింది. ఇందులో 20 మంది గాయపడగా అందులో కొంత మంది మరణించారు. ఈ దాడిని చైనా ఖండించకపోగా.. శాంతి వచనాలు పలికింది. 'సయోధ్య కోసం నిర్వహించే శాంతి చర్చలను ప్రోత్సహించడానికి మయన్మార్‌లోని అన్ని పార్టీలకు చైనా మద్దతు ఇస్తుంది. హింసాత్మక దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది' అని ప్రకటించింది.

డబ్బులకే విక్రయం!

అయితే ఈ ఆయుధాలను చైనా ఉచితంగా సరఫరా చేయడం లేదు. మయన్మార్​లో హింసను ప్రేరేపించడం ద్వారా డబ్బులు సంపాదిస్తోంది. ఆయుధాల కోసం ఆగ్నేయాసియాలోని చైనా సంస్థలు, థాయ్​లాండ్ ఆయుధ స్మగ్లర్లకు అరకన్ ఆర్మీ డబ్బులు చెల్లిస్తుంది.

వీరి ద్వారా అడ్డు తొలగించుకోవడమే!

ప్రభుత్వాన్ని బెదిరించడానికి ఇలాంటి స్థానిక ఉగ్ర సంస్థలను చైనా ఉపయోగించుకుంటోందని స్వీడన్​కు చెందిన జర్నలిస్ట్ బెర్టిన్ లింటర్ పేర్కొన్నారు. చైనా మద్దతు ఉన్న కాపర్​(రాగి) మైన్లకు సంబంధించి స్థానికంగా ఏదైనా సమస్య ఏర్పడితే వీరిని వాడుకుంటోందని అన్నారు. మైన్లకు ఏదైనా హాని జరిగితే హింసను ప్రేరేపించి చైనా ప్రతీకారం తీర్చుకుంటుందని అక్కడి మంత్రులే భయపడుతున్నారని చెప్పారు.

ఇదీ చదవండి- 'బాయ్​కాట్​ చైనాతో మేక్ ఇన్​ ఇండియాకు దెబ్బ!'

Last Updated : Jul 2, 2020, 6:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.