రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ యోగాన్-33 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్టు చైనా అంతరిక్ష సంస్థ ప్రకటించింది. పశ్చిమ చైనాలోని జియాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి ఆదివారం రాత్రి రెండు ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలోకి చేరుకున్నాయని వెల్లడించింది.
యోగాన్-33తో పాటు.. అంతరిక్షంలో మైక్రో, నానో సాంకేతిక ప్రయోగాలకు ఉద్దేశించిన మరో ఉపగ్రహాన్ని లాంగ్‌మార్చ్-4సీ రాకెట్ ద్వారా ప్రయోగించినట్టు శాస్త్రవేత్తల బృందం ప్రకటించింది. లాంగ్ మార్చ్ సిరీస్‌లో ఇది 375వ ప్రయోగం.
శాస్త్ర, సాంకేతిక రంగ పరిశోధనలతో పాటు.. భూ సర్వే, పంట దిగుబడుల అంచనా, విపత్తుల నివారణకు ఈ రెండు ఉపగ్రహాలు తోడ్పడతాయని చైనా తెలిపింది.
ఇదీ చదవండి: 'గగన్‌యాన్ ప్రయోగం కోసం హరిత ఇంధనం అభివృద్ధి'