ETV Bharat / international

చైనా 'చాంగె-5' మిషన్​ ప్రయోగం విజయవంతం - చాంగే -5 ప్రయోగం విజయవంతం

చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ.. చంద్రుడిపై మట్టి, రాళ్ల నమూనాలు సేకరించేందుకు 'చాంగె-5' మిషన్​ను విజయవంతంగా ప్రయోగించింది. మంగళవారం ఉదయం 4:30 గంటలకు లాంగ్​ మార్చ్​-5 రాకెట్​ను ప్రయోగించింది.

China successfully launched Chang'e-5 lunar
చంద్రుడి నమూనా సేకరణలకు చైనా ప్రయోగం
author img

By

Published : Nov 24, 2020, 11:04 AM IST

చంద్రుడిపైన ఉన్న మట్టి, రాళ్ల వంటి పదార్థాలను భూమిపైకి తీసుకువచ్చే లక్ష్యంతో.. చైనా తొలి మానవ రహిత స్పేస్​క్రాఫ్ట్​ను విజయవంతంగా ప్రయోగించింది. హైనన్​ రాష్ట్రంలోని.. వెంచాంగ్​ స్పేస్​క్రాఫ్ట్ లాంచ్ సైట్ నుంచి.. 'చాంగె-5' మిషన్​ ప్రయోగించింది. లాంగ్​ మార్చ్​-5 రాకెట్ ద్వారా బీజింగ్ కాలమానం ప్రకారం.. మంగళవారం ఉదయం 4:30 గంటలకు ఈ ప్రయోగం చేపట్టింది.

చైనా స్పేస్ చరిత్రలో 'చాంగె-5' మిషన్‌ క్లిష్టమైన, సవాలుతో కూడిన మిషన్​. అంతేకాకుండా చంద్రుడిపై నమునాలను సేకరించేందుకు 40 ఏళ్ల తర్వాత పంపిన తొలి స్పేస్​క్రాఫ్ట్​ ఇదే కావడం గమనార్హం.

40 ఏళ్లకు ముందు అమెరికా, రష్యాలు మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేపట్టాయి.

ఈ ప్రయోగంలో లూనార్ ఆర్బిట్​లో మానవరహిత డాకింగ్ వంటి క్లిష్టతరమైన విధానాలను ఎంచుకుంది చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్​ (సీఏఎస్​ఏ). ఈ మిషన్​ విజయవంతంగా పూర్తయింతే మానవ సహిత ప్రయోగాలకు పునాదులు పడుతాయని భావిస్తోంది.

ప్రయోగం వివరాలు..

చాంగె-5 రాకెట్​లో ఒక ఆర్బిటర్​, ల్యాండర్, యాక్సెండర్, రిటర్నర్​లను పంపించింది. వీటి మొత్తం బరువు 8.2 టన్నులు.

లూనార్ ఆర్బింట్​లోకి స్పేస్​ క్రాఫ్ట్ ప్రవేశించిన వెంటనే.. దాని నుంచి ల్యాండర్​- యాక్సెండర్​ల సమూహం.. ఆర్బిటర్-రిటర్నర్​ల సమూహం నుంచి వేరవుతాయి.

ఆ తర్వాత ఆర్బిటర్-రిటర్నర్​లు చంద్రుడి ఉపరితలానికి 200 కిలోమీటర్ల అర్బిట్​లో భ్రమణం చెందుతాయి. ల్యాండర్-యక్సెండర్​లు చంద్రుడి వాయివ్య ఉపరితంపైన దిగుతాయి.

చంద్రుడిపై కావాల్సిన నమూనాలు (2 కిలోలు) సేకరించిన తర్వాత యాక్సెలర్ తిరిగి ఆర్బిటర్​-రిటర్నర్​లకు డాక్ అవుతుంది. అక్కడి నుంచి తిరిగి భుమికి ఆ నమూనాలను మోసుకొస్తుంది.

ఇదీ చూడండి:అధికార బదిలీకి ట్రంప్ అంగీకారం.. కానీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.