ETV Bharat / international

చైనాలో 20 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్

చైనాలో ఇప్పటివరకు 20 కోట్లమందికి కరోనా టీకాలను అందించినట్లు ఆ దేశ వైద్యాధికారులు వెల్లడించారు. ఇది దేశ జనాభాలో 14.29 శాతంగా పేర్కొన్నారు. చైనా ఇప్పటివరకు దేశీయంగా అభివృద్ధి చేసిన ఐదు వ్యాక్సిన్​లను ఆమోదించినట్లు సెంటర్​ ఫర్​ డిసీజ్ కంట్రోల్ అధికారి క్యూగాంగ్​ తెలిపారు.

china vaccine
చైనా వ్యాక్సిన్
author img

By

Published : Apr 21, 2021, 5:03 PM IST

Updated : Apr 21, 2021, 9:35 PM IST

చైనాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఊపందుకుంది. ఇప్పటివరకు 20 కోట్లమంది చైనీయులకు టీకా అందించామని ఆ దేశ వైద్యాధికారులు వెల్లడించారు. చైనా జనాబాలో ఇది 14.29 శాతంగా పేర్కొన్నారు. కరోనా యోధులకు, యూనివర్సిటీ విద్యార్థులకు, సరిహద్దు ప్రాంతాల్లో ఉండే ప్రజలకు టీకాలు అందించినట్లు తెలిపారు. మయన్మార్ సరిహద్దు కలిగిన రూయిలీ నగరంలో బుధవారం కేవలం రెండు కేసులే నమోదైనట్లు వివరించారు.

చైనా ఇప్పటివరకు దేశీయంగా అభివృద్ధి చేసిన ఐదు వ్యాక్సిన్​లను ఆమోదించినట్లు సెంటర్​ ఫర్​ డిసీజ్ కంట్రోల్ అధికారి క్యూగాంగ్​ తెలిపారు. ఇవి 50.7 శాతం నుంచి 79.3 శాతం వరకు సత్ఫలితాలను ఇస్తున్నట్లు వివరించారు. జనాభాలో కొన్ని కీలకమైన వర్గాల వారికి టీకాలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. దేశంలోని 80 శాతం వైద్య సిబ్బందికి డోసులు అందించామన్నారు.

2019, డిసెంబర్​లో చైనాలోని వుహాన్​ నగరంలో మొట్టమొదటిసారి కరోనా ప్రభలింది. ఆ తర్వాత కఠినమైన ఆంక్షలు, నిబంధనలతో వైరస్ ను కట్టడి చేయటంలో చైనా విజయవంతమైంది. 2022 ఫిబ్రవరిలో చైనాలోని బీజింగ్​లో వింటర్ ఒలంపిక్స్ జరగనున్నాయి.

ఇదీ చదవండి : జపాన్​ ప్రధాని భారత పర్యటన రద్దు

Last Updated : Apr 21, 2021, 9:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.