ETV Bharat / international

చైనాలో దేశీయ కేసులు సున్నా... కానీ - కరోనా చైనా

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్​ను చైనా సమర్థవంతగా ఎదుర్కొంటోంది. ఆదివారం దేశీయంగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని వెల్లడించింది ఆ దేశ ప్రభుత్వం. అయితే, విదేశాల నుంచి వచ్చిన 39మందికి కరోనా పాజిటివ్​గా తేలిందని తెలిపింది. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ విమానాలను దారి మళ్లించి, ప్రయాణికుల్లో వైరస్​ను గుర్తించే దిశగా చర్యలు వేగవంతం చేసింది చైనా.

China reports no domestic coronavirus cases amid rise in imported infections; Beijing to divert all international flights
చైనాలో దేశీయ కేసులు సున్నా... కానీ
author img

By

Published : Mar 23, 2020, 11:02 AM IST

Updated : Mar 23, 2020, 5:36 PM IST

చైనాలో దేశీయ కేసులు సున్నా... కానీ

కరోనాపై చైనా చేపట్టిన చర్యలు ఫలితాల్నిస్తున్నాయి. ఆదివారం దేశీయంగా ఒక్క కరోనా​​ కేసు కూడా నమోదు కాలేదు. కానీ విదేశాల నుంచి వచ్చిన మరో 39మంది వైరస్ ​బారినపడ్డారు.

దేశీయంగా గెలిచింది కానీ...

గతవారం వరుసగా మూడు రోజుల పాటు ఒక్క దేశీయ కేసు కూడా నమోదు కాలేదు. కానీ శనివారం ఓ చైనావాసికి వైరస్​ సోకింది. కరోనా​ లక్షణాలున్న ఓ విదేశీయుడిని అతడు కలిసినట్టు తెలుస్తోంది. ఆ తరువాత ఆదివారం మళ్లీ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

కరోనాను దేశీయంగా అరికట్టగలిగినా.. విదేశాల నుంచి వచ్చే వైరస్​ బాధితులను కట్టడి చేయలేకపోతోంది చైనా. ఈ సమస్యను పరిష్కరించడానికి చర్యలు ముమ్మరం చేసింది. రాజధాని బీజింగ్​కు రావాల్సిన అన్ని అంతర్జాతీయ విమానాలను 12 ఇతర నగరాలకు మళ్లించాలని నిర్ణయించింది. ఈ విమానాశ్రయాల్లో ప్రయాణికులను నిర్బంధంలోకి తీసుకుని, క్షుణ్నంగా తనిఖీ చేయాలని ఆదేశించింది. కరోనా లేదని నిర్ధరణ అయ్యాకే బీజింగ్​కు వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది.

ఇప్పటివరకు చైనాలో 81, 093 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఆదివారం మృతిచెందిన 9 మందితో కలిపి.. మొత్తం 3,270 కొవిడ్​-19కు బలయ్యారు. మరో 5,120 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 72,703 మంది కరోనాను జయించి ఇళ్లకు చేరారు.

ఇదీ చదవండి:సెనేట్​లో గట్టెక్కని ట్రంప్​ ట్రిలియన్​ డాలర్ల 'ప్యాకేజీ'

Last Updated : Mar 23, 2020, 5:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.