ETV Bharat / international

చైనాలో మరో 36 'దొంగ కరోనా' కేసులు - NHC

చైనాలో కొత్తగా 39 మందికి కరోనా సోకింది. వీటిలో 36 కేసులు రోగ లక్షణాలు కనిపించనవే.

China reports 39 new coronavirus cases
చైనాలో కొత్తగా 39 కరోనా కేసులు
author img

By

Published : May 24, 2020, 10:49 AM IST

చైనాలో మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తోంది. కొత్తగా 39 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఆ రోగుల్లో 36 మందికి కరోనా రోగ లక్షణాలు బయటకు కనిపించడం లేదని వైద్యులు తెలిపారు.

"మొత్తం 39 కేసుల్లో మూడు కరోనా పాజిటివ్ కేసులుగా ధ్రువీకరించాం. ఒకరికి స్థానికంగానే వైరస్ సంక్రమణ జరగగా... మరో ఇద్దరు విదేశాల నుంచి వచ్చినవారు."

- చైనా జాతీయ ఆరోగ్య కమిషన్

రోగ లక్షణాలు కనిపించని మిగతా 36 కొత్త కేసుల్లో... 30 హుబే, ఆ రాష్ట్ర రాజధాని వుహాన్​లోనే నమోదైనట్లు ఎన్​హెచ్​సీ వెల్లడించింది. దేశంలోని మొత్తం 371 మంది లక్షణాలు కనిపించని రోగుల్లో... 297 మంది హుబే​లోనే ఉన్నారని, వీరంతా క్వారంటైన్​లో ఉన్నట్లు తెలిపింది.

అధికారిక గణాంకాల ప్రకారం, చైనాలో ఇప్పటి వరకు 82,974 కరోనా కేసులు, 4,634 మరణాలు నమోదయ్యాయి.

ఇదీ చూడండి: 2 నెలల తర్వాత ఉపశమనం- ఆంక్షలు సడలింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.