ETV Bharat / international

భారత్​ హెచ్చరికతో చర్చలకు సిద్ధమైన చైనా! - తూర్పు లద్దాఖ్

తూర్పు లద్దాఖ్​లో పరిస్థితులను మెరుగుపర్చేందుకు భారత్​తో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నట్లు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ తెలిపారు. పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం భేటీకి సుముఖత వ్యక్తం చేశారు.

India-China relations
భారత్‌ చైనా సంబంధాలు
author img

By

Published : Jul 15, 2021, 1:25 PM IST

తూర్పు లద్దాఖ్​లో ప్రస్తుత పరిస్థితులు అలాగే కొనసాగడం వల్ల ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని భారత్​ హెచ్చరించిన నేపథ్యంలో చైనా స్పందించింది. అత్యవసరంగా పరిష్కరించాల్సిన అంశాలపై పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాల కోసం చర్చలకు సిద్ధమని తెలిపింది.

తజకిస్థాన్​ రాజధాని దుషన్‌బేలో జరిగిన షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీతో జైశంకర్‌ బుధవారం చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వాస్తవాధీన రేఖ వెంబడి ఏకపక్ష చర్యలను భారత్​ ఆమోదించదని జైశంకర్​ స్పష్టంచేశారు. తూర్పు లద్దాఖ్‌లో శాంతి, సుస్థిరతను పునరుద్ధరించిన తర్వాతే భారత్‌తో చైనా సంబంధాలు అభివృద్ధి చెందుతాయని స్పష్టం చేశారు.

పాంగాంగ్​​ సరస్సు ప్రాంతంలో ఈ ఫిబ్రవరిలో బలగాల ఉపసంహరణ జరిగిన నాటి నుంచి ఇతర వివాదాస్పద ప్రాంతాల్లో ఆ ప్రక్రియ ముందుకు కదలలేదు. ఈ నేపథ్యంలోనే భారత్​-చైనా సంబంధాలు అత్యల్ప స్థాయిలోనే కొనసాగుతున్నాయని, పరిస్థితిని మెరుగుపర్చేందుకు భారత్​తో చర్చలకు సిద్ధమని వాంగ్​ అన్నారు.

ఇవీ చూడండి:

'గల్వాన్​లో మరోసారి భారత్​-చైనా సైనికుల ఘర్షణ!'

టిబెట్​ యువతతో చైనా సైన్యం దుష్ట పన్నాగం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.