ETV Bharat / international

కొండను ఢీకొట్టిన విమానం.. భారీగా ప్రాణనష్టం

Plane crash
విమాన ప్రమాదం
author img

By

Published : Mar 21, 2022, 2:05 PM IST

Updated : Mar 21, 2022, 6:32 PM IST

14:02 March 21

ఘోర ప్రమాదం- 132 మందితో వెళ్తూ కూలిన విమానం

విమాన ప్రమాదంలో చెలరేగిన మంటలు

China Plane crash: చైనాలో సోమవారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. 132 మందితో వెళ్తున్న ప్రయాణికుల విమానం గువాంగ్​షీ రాష్ట్రం, వూఝౌ నగర సమీపంలోని పర్వత ప్రాంతంలో కూలిపోయింది. చైనా ఈస్టర్​ ఎయిర్​లైన్స్​కు చెందిన బోయింగ్​ 737 విమానం.. కున్​మింగ్​ నుంచి గువాంగ్​ ఝౌకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాంతీయ విపత్తు స్పందన విభాగం వెల్లడించింది. ఈ ప్రమాదంలో పర్వత ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానంలోని వారి పరిస్థితిపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.

విమానంలో మొత్తం 132 మంది ఉండగా.. అందులో 123 మంది ప్రయాణికులు, తొమ్మిది మంది సిబ్బంది అని చైనా పౌర విమానయాన విభాగం తమ వెబ్​సైట్లో పేర్కొంది. ప్రస్తుతానికి మరణాలపై ఎలాంటి సమాచారం లేదని తెలిపింది.

చైనా ఈస్టర్న్​ ఎయిర్​లైన్స్​కు చెందిన ఈ MU5735 విమానం.. కున్​మింగ్​ నుంచి గువాంగ్​ఝౌకు రావాల్సి ఉండగా సమయానికి గమ్యాన్ని చేరుకోలేదని బైయున్​ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు తెలిపారు. స్థానిక కాలమాన ప్రకారం సోమవారం మధ్యాహ్నం 1.10 గంటలకు కున్​మింగ్​లో బయలుదేరింది. గువాంగ్​ఝౌ నగరానికి మధ్యాహ్నం 2.52 గంటలకు చేరుకోవాల్సి ఉంది. అయితే, వూఝౌ సమీపంలో కూలిపోయినట్లు సమాచారం అందిందని అధికారులు వెల్లడించారు.

ఘటనాస్థలికి 600మంది అగ్నిమాపక సిబ్బంది

వూఝౌ అగ్నిమాపక విభాగం.. 117 మంది సిబ్బందిని, 23 అగ్నిమాపక యంత్రాలను సంఘటనాస్థలానికి పంపి సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపింది. మరో 538 మంది అగ్నిమాపక సిబ్బంది ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నట్లు చెప్పింది. మరోవైపు.. విమాన ప్రమాదం, బాధిత కుటుంబాలకు సాయం అందించే విషయంపై తొమ్మిది బృందాలను ఎయిర్​లైన్స్​ ఏర్పాటు చేసినట్లు చైనా మీడియా తెలిపింది.

ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే కొండ ప్రాంతంలో మంటలు చెలరేగుతున్న కొన్ని వీడియోలు, చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. చైనాకు చెందిన మూడు ప్రధాన విమానయాన సంస్థల్లో చైనా ఈస్టర్న్​ ఎయిర్​లైన్స్​ ఒకటి. ఫిబ్రవరి 19 నాటికి 100 మిలియన్​ గంటలు సురక్షితంగా విమాన ప్రయాణాలను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

షీ జిన్​పింగ్​ దిగ్భ్రాంతి..

బోయింగ్​ 737 విమానం ప్రమాదానికి గురవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అన్ని అంశాలపై దర్యాప్తు చేపట్టాలన్నారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించిన తర్వాత కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలను రక్షించేందుకు పౌర విమానయాన రంగాన్ని బలోపేతం చేయాలన్నారు.

ఇదీ చూడండి: ఆరు నెలల క్రితం దేశానికి ఆర్థిక మంత్రి.. ఇప్పుడు క్యాబ్​ డ్రైవర్!

Last Updated : Mar 21, 2022, 6:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.