సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత పేరుతో నూతన జాతీయ సరిహద్దు చట్టాన్ని (China Border news) తీసుకొచ్చింది చైనా. సరిహద్దులు, ప్రాదేశిక సమగ్రతకు వ్యతిరేకంగా చేపట్టే పనులను అడ్డుకునేందుకు చైనా ఎలాంటి చర్యలైనా చేపడుతుందని చట్టంలో పేర్కొంది. మౌలిక సదుపాయాల కల్పన సహా సరిహద్దు రక్షణ, ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం పాటు పడనున్నట్లు (China news today) తెలిపింది. సరిహద్దుల్లో ప్రజలు నివసించేలా, పని చేసుకునేలా ప్రోత్సహించనున్నట్లు వెల్లడించింది. చైనా తీసుకొచ్చిన తాజా చట్టం భారత్‌తో సరిహద్దు వివాదంపై (China India border dispute) ప్రభావం చూపే అవకాశం ఉంది.
శనివారం ముగిసిన చైనా జాతీయ పీపుల్స్ కాంగ్రెస్.. స్టాండింగ్ కమిటీ సభ్యుల మీటింగ్‌లో ఈ మేరకు చట్టానికి ఆమోదం తెలిపారు. ఈ చట్టం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి రానుంది. సమానత్వం, పరస్పర విశ్వాసం, స్నేహపూర్వక సంప్రదింపులు అనే సూత్రాల ద్వారా సరిహద్దు వ్యవహారాలను నిర్వహించనున్నట్లు చట్టంలో పేర్కొన్నారు. చర్చలతోనే పొరుగు దేశాలతో వివాదాలను పరిష్కరించుకుంటామని వివరించారు.
రెండు దేశాలతో వివాదం
భారత్, భూటాన్ దేశాలతో చైనాకు సరిహద్దు వివాదాలు ఉన్నాయి. 12 పొరుగు దేశాలతో సరిహద్దును (China border dispute) నిర్ణయించుకున్నప్పటికీ.. భారత్, భూటాన్‌తో మాత్రం చైనాకు సరైన సరిహద్దు లేదు. భారత్‌తో (China India border) 3,488 కిలోమీటర్లు, భూటాన్‌తో 400 కి.మీ మేర సరిహద్దు వివాదాస్పదంగా (China disputed territory) ఉంది.
ఇదీ చదవండి: