సైనిక సహకారాన్ని బలోపేతం చేసుకునే దిశగా చైనా, పాకిస్థాన్‌లు మరో కార్యక్రమాన్ని తలపెట్టాయి. వైమానిక దళ విన్యాసాల్ని ఇరు దేశాలు సంయుక్తంగా చేపట్టనున్నాయి. ఈ మేరకు పాకిస్థాన్ వాయుసేనలోని ఓ బృందం చైనాకు సోమవారం బయలుదేరింది. ఆచరణాత్మకంగా సైన్య సహకరాల్ని మెరుగుపరుచకోవడం, వాస్తవ పోరాట శిక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చైనా సైన్యం తెలిపింది.
పాక్‌లోని సింధ్ రాష్ట్రం భొలారీ జిల్లాలోని ఎయిర్‌బేస్‌కు చెందిన సైనికులు.. చైనాకు బయలుదేరారు. చైనాలోని షహీన్(ఈగల్)-ఐక్స్ అనే ప్రాంతంలో జరిగే విన్యాసాల్లో వారు పాల్గొంటారని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. డిసెంబర్ చివరినాటికి ఈ కార్యక్రమం ముగియనుందని చెప్పింది. చైనా-పాకిస్థాన్ సైనిక సహకార ప్రణాళిక-2020లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.
చైనా, పాక్‌ల మధ్య ఈ తరహా విన్యాస కార్యక్రమం.. 2011, మార్చిలో పాకిస్థాన్‌లో తొలిసారి జరిగింది. జేఎఫ్-17 యుద్ధ విమానం, సహా ఇతర ఆయుధాల ఉత్పత్తుల్లో పాకిస్థాన్‌కు చైనా సహకారం అందిస్తోంది.
ఇదీ చూడండి:ఆంక్షల భయంతో బైడెన్‌కు చైనా 'చర్చల' వల!