కరోనా వైరస్‌ను ల్యాబ్‌లో సృష్టించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఇదివరకే స్పష్టం చేసినట్లు.. చైనా విదేశాంగశాఖ పేర్కొంది. ఈ మహమ్మారి మొదట ఆ దేశంలోని వుహాన్ నగరంలో వెలుగుచూసింది. అక్కడే ఓ ల్యాబ్‌లో కరోనా వైరస్‌ను సృష్టించారనే ఆరోపణలను ఆ దేశం ఖండించింది.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఈ విషయమై మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం కరోనా వైరస్ ల్యాబ్ నుంచి వ్యాప్తి చెందిందా? అనే విషయాన్ని తేల్చే పనిలో ఉందన్నారు. ఈ వ్యవహారంలో చైనా నిజానిజాలు వెల్లడించాలని స్టేట్ సెక్రెటరీ మైక్ పాంపియో డిమాండ్ చేశారు. కరోనా వ్యాప్తికి సంబంధించిన సమాచార వెల్లడిలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు చైనాపైనా విమర్శలు చేసింది ట్రంప్ ప్రభుత్వం.
నవంబర్‌లో మరోసారి దాడి!
కరోనా కోరల నుంచి ప్రపంచ దేశాలు ఇంకా కోలుకోలేదు. ఇంతలోనే మరో చేదు వార్త. ఇప్పుడు కుదుటపడినా.. ఆ మహమ్మారి నవంబర్‌లో మరోసారి దాడిచేసే అవకాశం ఉందని చైనా వైద్య నిపుణుడు ఒకరు పేర్కొన్నారు. కరోనా నుంచి విముక్తి ఎప్పుడు లభిస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రభుత్వాలకు ఈ విషయం ఆందోళన కలిగిస్తోంది.
షాంఘైలోని 'కొవిడ్-19 క్లినికల్ ఎక్స్‌పర్ట్ టీం'కు నేతృత్వం వహిస్తున్న జాంగ్ వెన్‌హాంగ్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో కరోనా మళ్లీ మళ్లీ దాడి చేసే ప్రమాదం ఉన్నందున, ప్రభుత్వాలు అందుకు తగ్గట్టుగా విధానాలను రూపొందించుకోవాలని తెలిపారు.
ఇదీ చదవండి:మొరపెట్టుకున్నా వినలేదు.. అందుకే ఇలా...