ETV Bharat / international

కొండచరియలు విరిగిపడి 14మంది మృతి - china landslide disaster

china landslide news: నిర్మాణాలు జరుగుతుండగా.. ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో 14మంది మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. సహాయక చర్యల్లో 1000కిపైగా మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ ఘటన చైనాలోని బిజీ నగరంలో జరిగింది.

china landslide news
కొండచరియలు విరిగిపడి.. 14మంది మృతి
author img

By

Published : Jan 4, 2022, 3:52 PM IST

china landslide news: నైరుతి చైనా గుయిజౌలోని ఓ నిర్మాణ ప్రదేశంలో కొండచరియలు విరిగిపడి 14మంది మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.

పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉండే గుయిజౌ.. చైనాలోనే అత్యంత తక్కువగా అభివృద్ధి చెందిన ప్రదేశాల్లో ఒకటి. ప్రమాద సమయంలో.. ఆ ప్రాంతంలో ఓ ఆసుపత్రికి సంబంధించిన శిక్షణా కేంద్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. రాత్రివేళ 1000మందికిపైగా ప్రజలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

చైనాలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతన్నాయి. 2015లో తయాన్​జిన్​లో ఓ రసాయన గిడ్డంగిలో జరిగిన పేలుళ్ల ధాటికి 173మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి:- 'ఆపరేషన్​ కైలాస్​​ రేంజ్'ఎఫెక్ట్​.. ఆ సరస్సుపై చైనా వంతెన నిర్మాణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.