ETV Bharat / international

అంగారక గ్రహంపై తొలిసారి చైనా అంతరిక్ష నౌక - మార్స్​ను తాకిన చైనా అంతరిక్ష నౌక

అంతరిక్ష పరిశోధనల్లో భాగంగా మార్స్​పై చైనా పంపిన తొలి వ్యోమనౌక.. అంగారక గ్రహం చేరిందని ఆ దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ(సీ​ఎన్ఎస్​ఏ) తెలిపింది. ఏడు నెలల పాటు ప్రయాణించిన ఈ రోవర్​.. మరో మూడు నెలల పాటు అక్కడే ఉండి.. అంగారక గ్రహంపై భూగర్భ జలాలు, ప్రాచీన నాగరికత వంటి అంశాలపై అధ్యయనం చేయనుంది.

Tianwen-1, China spacecraft
చైనా అంతరిక్ష నౌక, తియాన్​వెన్​-1
author img

By

Published : May 15, 2021, 9:10 AM IST

Updated : May 15, 2021, 2:33 PM IST

మార్స్​పై చైనా ప్రయోగించిన తొలి అంతరిక్ష నౌక తియాన్​వెన్​-1.. అంగారక గ్రహాన్ని తాకినట్టు చైనా నేషనల్​ స్పేస్​ అడ్మనిస్ట్రేషన్​(సీఎన్​ఎస్​ఏ) శనివారం ప్రకటించింది. ఆర్బిటర్​, ల్యాండర్​, రోవర్​ కలిగిఉన్న తియన్​వెన్​-1ను.. గతేడాది జులై 23న ప్రయోగించింది ఆ దేశం.

CHINA-MARS
మార్స్​పై దిగుతున్న నౌక(గ్రాఫిక్స్ చిత్రం)
CHINA-MARS
మార్స్​పై దిగిన తర్వాత(గ్రాఫిక్స్ చిత్రం)

దాదాపు ఏడు నెలల సుదీర్ఘ ప్రయాణం అనంతరం.. గత ఫిబ్రవరిలో ఈ నౌక మార్స్​ కక్ష్యలోకి ప్రవేశించినట్టు చైనా వార్తా సంస్థ తెలిపింది. ఆ తర్వాత.. అక్కడ ల్యాండింగ్​ పరిస్థితుల్ని పరిశీలించేందుకు సుమారు రెండు నెలల సమయం పట్టిందని వెల్లడించింది. ప్రస్తుతం.. ఈ రోవర్​ అంగారక గ్రహంపై భూగర్భ జలాలు, ప్రాచీన నాగరికత వంటి అంశాలపై అధ్యయనం చేసేందుకు మూడు నెలలపాటు అక్కడ పనిచేస్తుందని సీఎన్​ఎస్​ఏ భావిస్తోంది.

CHINA-MARS
తెరుచుకుంటున్న సౌరఫలకాలు(గ్రాఫిక్స్ చిత్రం)
CHINA-MARS
పూర్తిగా సౌరఫలకాలు తెరుచుకున్న తర్వాత(గ్రాఫిక్స్ చిత్రం)

అంగారక కక్ష్యాన్వేషణ, ల్యాండింగ్​, రోవింగ్​ చేయాలనే లక్ష్యంతో.. సౌర వ్యవస్థపై అన్వేషించే దిశగా.. ప్రస్తుతం తమ తొలిదశ ప్రయోగాలు కొనసాగుతన్నాయని సీఎన్​ఎస్​ఏ వెల్లడించింది.

CHINA-MARS
అంగారకుడిపై దిగుతూ...(గ్రాఫిక్స్ చిత్రం)
CHINA-MARS
పారాచూట్ సాయంతో కిందకు...

తొలి ఆసియా దేశంగా భారత్​..

ఆరు చక్రాలున్న రోవర్‌ సుమారు 240 కిలోల బరువుతో గంటకు 200 మీటర్ల ప్రయాణిస్తుంది. మూడు నెలలపాటు అక్కడే తిరుగుతూ ప్రయోగాలు చేయనుంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, భారత్‌, యూరోపియన్ యూనియన్‌ దేశాలు అంగారకుడిపై ప్రయోగాలు చేసి సత్ఫలితాలు సాధించాయి. అంగారకుడిపై అడుగుపెట్టిన తొలి ఆసియా దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించింది. 2014లో మంగళ్‌యాన్‌ ప్రయోగం ద్వారా ఈ ఘనత సాధించింది భారత్‌.

CHINA-MARS
మార్స్ కక్ష్యలో..

ఇదీ చదవండి: ఒడిశా విద్యార్థుల సత్తా- నాసా పోటీల్లో మూడో స్థానం

Last Updated : May 15, 2021, 2:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.