ETV Bharat / international

కశ్మీర్​ అంశంపై మరోసారి చైనా అక్కసు - kashmir issue

ఆర్టికల్ 370 రద్దుపై చైనా మరోసారి వక్రభాష్యం చెప్పింది. పరోక్షంగా భారత్​ను ఉద్దేశించి యథాతథ స్థితిపై ఏకపక్ష మార్పులు అక్రమమని వ్యాఖ్యానించింది. రెండు దేశాల మధ్య విభేదాలను భారత్, పాక్ చర్చల ద్వారా పరిష్కరించుకుంటాయని పేర్కొంది.

INDIA PAK- CHINA
చైనా
author img

By

Published : Aug 5, 2020, 5:44 PM IST

కశ్మీర్​ విషయంలో భారత్​పై మరోసారి చైనా అక్కసు వెళ్లగక్కింది. రెండు దేశాల మధ్య విభేదాలను భారత్​, పాక్​ చర్చల ద్వారా పరిష్కరించుకుంటాయని చెబుతూనే ఏకపక్ష మార్పులు అక్రమమని విషం చిమ్మింది. సంబంధాల బలోపేతం ద్వారా రెండు దేశాలు సంయుక్తంగా శాంతి, స్థిరత్వం, అభివృద్ధికి కృషి చేస్తాయని భావిస్తున్నట్లు తెలిపింది.

జమ్ముకశ్మీర్​ స్వయం ప్రతిపత్తి రద్దు చేసి ఏడాది గడిచిన నేపథ్యంలో పాక్ పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానమిచ్చారు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్​బిన్.

"కశ్మీర్​ ప్రాంతంలో పరిస్థితిని చైనా నిశితంగా గమనిస్తోంది. ఈ విషయంలో మా వైఖరి స్థిరంగా, స్పష్టంగా ఉంది. ఇది ఆ రెండు దేశాల మధ్య చరిత్రకు సంబంధించిన వివాదం. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు, ఐరాస ఛార్టర్, భద్రతా మండలి తీర్మానాలు ఈ వాస్తవాన్నే వెల్లడిస్తు్న్నాయి. అయితే యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చటం అక్రమం. భారత్​, పాక్ పొరుగుదేశాలు. ఈ విషయాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి."

- వాంగ్ వెన్​బిన్​, చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

ఆర్టికల్​ 370 రద్దు విషయంలో పాక్​కు వంత పాడుతూ వస్తోంది చైనా. భారత్ చర్య ఆమో​దయోగ్యం కాదని గతేడాది వ్యాఖ్యానించింది. ప్రస్తుతం భారత్​, చైనా మధ్య తూర్పు లద్దాఖ్​లో ప్రతిష్టంభన నేపథ్యంలో వాంగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇదీ చూడండి: కశ్మీర్​ అంతర్భాగంగా పాక్ మ్యాప్​.. భారత మండిపాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.