ETV Bharat / international

కరోనా వ్యాక్సిన్​కు చైనా తొలి పేటెంట్​ మంజూరు

కొవిడ్​-19 వ్యాక్సిన్​కు తొలి పేటెంట్​ను మంజూరు చేసింది చైనా. బయోఫార్మాస్యూటికల్​ సంస్థ కాన్సినో తయారు చేస్తోన్న ఈ టీకాకు అధికారికంగా అనుమతులు అందాయి. దీంతో టీకా సమర్థత, భద్రతను ధ్రువీకరించినట్లయిందని సంస్థ ప్రకటించింది. తాజా నిర్ణయంతో మార్కెట్​ విశ్వాసం పెరుగుతుందని తెలిపింది.

China grants 1st patent to indigenously developed COVID-19 vaccine
కరోనా వ్యాక్సిన్​కు చైనా తొలి పేటెంట్​ మంజూరు
author img

By

Published : Aug 17, 2020, 9:31 PM IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ వ్యాక్సిన్​ కోసం యావత్​ ప్రపంచం ఎదురుచూస్తోంది. ఇప్పటికే తొలి వ్యాక్సిన్​ను రష్యా విడుదల చేయగా.. తాజాగా చైనా తమ దేశ వ్యాక్సిన్​కు తొలి ఆవిష్కరణ పేటెంట్​ను మంజూరు చేసింది. ఈ వ్యాక్సిన్​ను బయోఫార్మాస్యూటికల్​ సంస్థ కాన్సినో బయోలాజిక్స్​ తయారు చేస్తోంది.

గ్లోబల్​ టైమ్స్​ నివేదిక ప్రకారం.. ఈ టీకా 'ఏడీ5-ఎన్​కోవ్​' అనే పునసంయోగ ఎడినోవైరస్ వెక్టార్​​. ఇది చైనా సైనిక విభాగంలోని అంటువ్యాధుల నిపుణుడు చెన్​ వీ నేతృత్వంలోని బృందంతో కాన్సినో అభివృద్ధి చేసింది.

" పేటెంట్​ మంజూరుతో టీకా సమర్థత, భద్రతను మరింత ధ్రువీకరించినట్లయింది. అధికారికంగా పేటెంట్​ మంజూరుతో చైనా అభివృద్ధి చేసిన కొవిడ్​-19 వ్యాక్సిన్​పై మార్కెట్​ విశ్వాసం పెరుగుతుంది. ముఖ్యంగా విదేశీ మార్కెట్లో విశ్వాసం పెరుగుతుంది."

- కాన్సినో

తొలి దశ క్లినికల్​ ట్రయల్స్ ప్రారంభించిన మూడు రోజుల తర్వాత​ .. జాతీయ మేధో సంపత్తి పరిపాలన విభాగానికి పేటెంట్​ కోసం మార్చి 18న దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది కాన్సినో. ఆయితే.. ఆగస్టు 11న అనుమతులు వచ్చినట్లు వెల్లడించింది.

విదేశాల్లో మూడో దశ ట్రయల్స్​..

విదేశాలలో నిర్వహించబోయే టీకా మూడోదశ ట్రయల్స్​ సజావుగా సాగుతాయని కంపెనీ ప్రకటించింది. కాన్సినో పెద్దఎత్తున మూడోదశ క్లినికల్​ ట్రయల్స్​ చేసేందుకు మెక్సికోతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వ్యాక్సిన్​ మూడోదశ ట్రయల్స్​కు తాము సహకరిస్తామని ఆగస్టు 9న ప్రకటించింది సౌదీ అరేబియా. అందుకోసం 5 వేల మంది వలంటీర్లను నియమించినట్లు తెలిపింది. అలాగే.. రష్యా, బ్రెజిల్​, చిలీతో చర్చలు జరుపుతోంది.

మరోవైపు.. రష్యా తొలి బ్యాచ్​ వ్యాక్సిన్​ ఉత్పత్తిని ప్రారంభించింది. ప్రపంచ తొలి వ్యాక్సిన్​ను విడుదల చేస్తున్నట్లు ఇటీవలే రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్​ పుతిన్​ ప్రకటించారు. వచ్చే వారం రోజుల్లో ఈ వ్యాక్సిన్​ మూడోదశ ట్రయల్స్​ ప్రారంభం కానున్నాయి.

ఇదీ చూడండి: కరోనా వ్యాక్సిన్ రేసులో ఏ దేశం ఎక్కడ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.