సరిహద్దులో గతవారం కాల్పులు జరిగిన తర్వాత చైనా సైన్యం తన యుద్ధ సన్నద్ధతను రెండో అత్యున్నత స్థాయికి పెంచిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక పేర్కొంది. భారత్, చైనా విదేశాంగ మంత్రుల సమావేశం తర్వాత కాస్త వెనక్కి తగ్గినట్లు తెలిపింది. చైనా సైనికాధికారుల వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఈమేరకు కథనం ప్రచురించింది.
ఇదీ చదవండి- తూర్పు లద్దాఖ్‌లోని ఎల్ఏసీ వద్ద కాల్పులు!
రెండో స్థాయి యుద్ధ సన్నద్ధతలో భాగంగా ఎక్కువ మంది సైన్యాన్ని మోహరించడం, మరిన్ని ఆయుధాలు సమకూర్చుకోవడం వంటివి జరిగాయని పత్రిక తెలిపింది. కమాండర్లు, జవానులు, అధికారులకు సైనిక శిక్షణ కార్యక్రమాలు మరింత వేగవంతం చేసిందని పేర్కొంది.
"యుద్ధ సన్నద్ధత స్థాయి పెంచినందున.. కమాండర్లు, అధికారులు, సైనికులు అన్ని వేళలా పనిచేస్తున్నారు. అదనపు శిక్షణ కార్యక్రమాలు, డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. మరిన్ని ఆయుధాలతో పాటు మరికొంత మంది సైన్యాన్ని వాస్తవాధీన రేఖకు పీఎల్ఏ తీసుకొచ్చింది."
-అధికార వర్గాలు
1987లో సుమ్దోరాంగ్ ఛు లోయలో ఇరుదేశాల మధ్య ఘర్షణ తలెత్తిన సమయంలో చైనా సైన్యం ఇలా అత్యున్నత స్థాయిలో సన్నద్ధమైందని, ఆ తర్వాత ఇదే తొలిసారి అని వెల్లడించింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, భారత విదేశాంగ మంత్రి జైశంకర్ సమావేశం తర్వాతే ఈ స్థితిని సడలించిట్లు మరో అధికారి చెప్పినట్లు స్పష్టం చేసింది.
చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యుద్ధ సన్నద్ధత నాలుగు దశల్లో ఉంటుంది. సాయుధ పోరాటం అనివార్యమని సైనిక అధికారులు భావించినప్పుడు తొలి దశను అమలు చేస్తుంది.
ఇవీ చదవండి