బిట్‌కాయిన్ వంటి వర్చువల్ కరెన్సీ(Cryptocurrency News) లావాదేవీలు అక్రమమైనవిగా ప్రకటించింది చైనా సెంట్రల్ బ్యాంక్(China Central Bank News). అనధికార డిజిటల్ మనీని నిషేధించాలని పేర్కొంది.
చైనా బ్యాంకుల్లో 2013లోనే క్రిప్టోకరెన్సీ(Cryptocurrency) వినియోగంపై నిషేధం విధించారు. అయితే.. ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ మైనింగ్, ట్రేడింగ్ ఇప్పటికీ జరుగుతోందన్న అనుమానం నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. డిజిటల్ కరెన్సీ వల్ల ఆర్థిక రంగంపై పరోక్షంగా ప్రభావం పడుతుందని పేర్కొంది.
'బిట్‌కాయిన్, ఎథీరియం మొదలైన డిజిటల్ కరెన్సీల వల్ల ఆర్థిక రంగంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మనీ లాండరింగ్, ఇతర నేరాలకు క్రిప్టోకరెన్సీ ఉపయోగపడుతుంది' అని చైనా సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. వర్చువల్ కరెన్సీతో లావాదేవీలు జరపొద్దని, అది నేరమని తమ వెబ్సైట్లో తెలిపింది.
అయితే.. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ప్రస్తుతం క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్ కోసం ప్రత్యేకంగా యువాన్ ఎలక్ట్రానిక్ వర్షన్‌ను సిద్ధం చేస్తుండటం గమనార్హం.
ఇదీ చదవండి: