ETV Bharat / international

చైనాలో మరోసారి కొవిడ్ కలకలం.. రెండేళ్ల గరిష్ఠానికి కొత్త కేసులు

China Covid Cases: చైనాలో మరోసారి కొవిడ్-19 కలకలం రేపుతోంది. తాజాగా దేశవ్యాప్తంగా 2 వేల కరోనా కేసులు నమోదు అయినట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ పేర్కొంది. హాంకాంగ్​లోనూ వైరస్ విజృంభిస్తోంది.

Covid cases
కొవిడ్
author img

By

Published : Mar 13, 2022, 11:30 AM IST

China Covid Cases: కరోనా పుట్టినిల్లు అయిన చైనాలో మరోసారి కొవిడ్ విజృంభిస్తోంది. రెండేళ్లలోనే అత్యధిక స్థాయిలో అక్కడ రోజువారీ కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా దేశవ్యాప్తంగా దాదాపు 2 వేల మంది వైరస్ బారిన పడినట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ పేర్కొంది. చైనా రాజధాని బీజింగ్​లో 20 మందికి వైరస్ నిర్ధరణ అయినట్లు తెలిపింది.

జిలిన్ ప్రావిన్స్​లో అత్యధికంగా 1,412 కేసులు నమోదయ్యాయి. దీంతో గతవారమే జిలిన్ రాజధాని చాంగ్​చున్​లో లాక్​డౌన్ విధించింది. చాంగ్​చున్​తోపాటు షాన్​డాంగ్ ప్రావిన్స్​లోని యూచెంగ్ నగరంలోనూ లాక్​డౌన్ అమలు చేస్తోంది చైనా. యూచెంగ్​లో మొత్తం జనాభా 5 లక్షలు.

షాన్​డాంగ్​లో 175, గాంగ్​డాంగ్​లో 62, షాన్​క్సీలో 39, హెబీలో 33, జియాంగ్సూలో 23, తియాన్​జిన్​లో 17, బీజింగ్​లో 20 కేసులు నమోదు అయినట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. హాంకాంగ్​లోనూ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. హాంకాంగ్​లో కొత్తగా 27,647మందికి వైరస్ నిర్ధరణ అయింది.

ఇదీ చూడండి: 'ప్రపంచానికి మరో వైరస్ ముప్పు'.. ఉక్రెయిన్​కు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.