అరుణాచల్ ప్రదేశ్ వద్ద భారత సరిహద్దుకు సమీపంలో రైల్వే ట్రాక్ పనులను చైనా పూర్తి చేసింది. టిబెట్ ప్రాంతంలోని లాసా, నైతి పట్టణాలను కలుపుతూ రైల్వే లైన్‌ను వేసింది. ఇంచింగ్ను లింగ్చి అని కూడా పిలుస్తారు.
టిబెట్‌లోని చింగై- టిబెట్ రైల్వేలైన్ తర్వాత సెషువాన్-టిబెట్ లైన్ రెండో అతిపెద్దది. ఈ సెషువాన్- టిబెట్ రైల్వేమార్గం సెషువాన్ రాష్ట్రంలోని చుంగ్దూ నుంచి ప్రారంభమై యాన్ ద్వారా వెళుతూ టిబెట్‌లోకి ప్రవేశిస్తుంది. ఈ మార్గం వల్ల చెంగ్దు నుంచి లాసా చేరుకోవడానికి కేవలం 13 గంటల సమయమే పడుతుంది. చెంగ్దు నుంచి లాసా చేరుకోవడానికి ఇది వరకు రెండు రోజులు పట్టేది.
టిబెట్‌లోని సెషువాన్ రాష్ట్రాన్ని లింగ్చి ని కలుపుతూ రైల్వే మార్గం పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గత నెలలోనే ఆదేశించారు.
ఇదీ చూడండి: చైనా కుట్ర- డోక్లామ్ సమీపంలో రహదారి నిర్మాణం