ETV Bharat / international

కరోనా తొలి నమూనాలను లేకుండా చేశాం: చైనా - china destroyed corona virus first samples

వుహాన్​లో కరోనా వైరస్ పుట్టుకొచ్చిన తొలి రోజుల్లో సేకరించిన నమూనాలను ధ్యంసం చేశామని ఒప్పుకుంది చైనా. గతంలో చైనా ఇన్‌ఫ్లూయెంజా, సార్స్‌ వైరస్‌ నమూనాలను ప్రపంచ దేశాలకు అందించిన చైనా కొవిడ్​ తొలి నమూనాలను మాత్రం నాశనం చేసినట్లు స్పష్టం చేసింది.

china clarification on covid 19 first samples
కరోనా తొలి నమూనాలను లేకుండా చేశాం: చైనా
author img

By

Published : May 16, 2020, 7:51 AM IST

కరోనా వైరస్‌ వ్యాపించిన మొదట్లో సేకరించిన నమూనాలను నాశనం చేయాలని తామే ఆదేశించినట్లు చైనాకు చెందిన 'నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌'(ఎన్‌హెచ్‌సీ) అంగీకరించింది. అప్పటికి సార్స్‌ కోవ్‌2ను గుర్తించకపోవడం వల్ల ఆ నమూనాల కారణంగా వైరస్‌ మరింత మందికి వ్యాపించకుండా ఈ నిర్ణయం తీసుకొన్నామని వివరించింది. విషయాన్ని ఎన్‌హెచ్‌సీలోని సైన్స్‌ అండ్‌ హెల్త్‌ విభాగానికి చెందిన ల్యూ డెంగ్‌ఫెంగ్‌ ప్రకటించారు.

కేవలం అనుమతుల్లేని ప్రయోగశాలల్లోని నమూనాలనే ధ్వంసం చేయాలని పేర్కొన్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని అమెరికా అధికారులు వక్రీకరించి గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. గుర్తుతెలియని న్యుమోనియా వ్యాపించగానే కారణాలను గుర్తించేందుకు జాతీయ స్థాయి పరిశోధనశాలలు రంగంలోకి దిగాయని వెల్లడించారు. ఈ క్రమంలో పూర్తివిషయాలు వెల్లడయ్యేదాకా ఆ వైరస్‌ను అడ్డుకొనేందుకు 'క్లాస్‌-2' వ్యాధికారకంగా దానిని వర్గీకరించామన్నారు.

వైరస్‌ పరీక్షలకు అవసరమైన రక్షణ సదుపాయాలు లేని పరిశోధన శాలల్లో నమూనాలను ధ్వంసం చేయమన్నామని పేర్కొన్నారు. గతంలో చైనా ఇన్‌ఫ్లూయెంజా, సార్స్‌ వైరస్‌ నమూనాలను ప్రపంచ దేశాలకు అందించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధన ప్రకారం శాస్త్ర పరిశోధనలకు సహకరించేందుకు, టీకాలు, పరీక్షా కిట్లు వంటి వాటి తయారీ, పంపిణీకి చైనా కట్టుబడి ఉంటుందన్నారు. అమెరికా ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.

ఇదీ చదవండి:రిక్షా బాలుడు: తల్లిదండ్రుల భారాన్ని.. వందల కి.మీ మోస్తూ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.