అతివాద ఇస్లామిస్ట్ పార్టీ ఒత్తిడికి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తలవంచారు. టీఎల్పీ(తెహ్రీక్ ఇ లబైక్ పాకిస్థాన్) పార్టీ కార్యకర్తల నిరసనలను అదుపు చేయలేక చేతులెత్తేసిన ఇమ్రాన్ రాజీకి దిగారు. ఆ పార్టీతో రహస్య ఒప్పందం చేసుకొని ఉగ్రవాదం సహా వంద కేసులు ఎదుర్కొంటున్న టీఎల్పీ అధినేత సాద్ హుస్సేన్ రిజ్వీని (TLP leader Saad Rizvi) విడుదల (TLP leader released) చేశారు.
తీవ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న రిజ్వీ(TLP leader Saad Rizvi).. ఈ ఏడాది ఏప్రిల్లో అరెస్టయ్యాడు. ఆయన పార్టీ అయిన టీఎల్పీపై నిషేధం విధించారు. ఉగ్రవాదం, హత్య, హత్యాయత్నం వంటి వందకుపైగా ఎఫ్ఐఆర్లు రిజ్వీపై (TLP leader arrested) నమోదయ్యాయి. ఆయన అరెస్టైనప్పటి నుంచి టీఎల్పీ నేతృత్వంలో పాకిస్థాన్లో భారీ నిరసనలు (TLP Pakistan protest ) జరిగాయి. నిషేధం ఎత్తివేయడం, రిజ్వీ విడుదల (TLP chief Saad Hussain Rizvi) సహా ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించాలంటూ అక్టోబర్లో ఇస్లామాబాద్ ముట్టడికి లాహోర్ నుంచి పిలుపునిచ్చింది ఎల్టీపీ.
దేశ ప్రయోజనాల దృష్ట్యా!
గత నెలలో టీఎల్పీతో రహస్య ఒప్పందం చేసుకున్న పాకిస్థాన్ కేంద్ర ప్రభుత్వం.. ఆ పార్టీపై నిషేధాన్ని ఎత్తివేసింది. 'దేశ ప్రయోజనాల' దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. రహస్య ఒప్పందం కుదిరిన తర్వాత టీఎల్పీ సభ్యులు తమ హింసాత్మక నిరసనలను నిలిపివేశారు.
ఈ నేపథ్యంలో గతవారం పంజాబ్ ప్రభుత్వం రిజ్వీ పేరును ఉగ్రవాదుల జాబితా నుంచి తొలగించింది. రిజ్వి కేసులపై ఫెడరల్ బోర్డు వద్ద ఉన్న రిఫరెన్సులను ఉపసంహరించుకుంది. దీంతో టీఎల్పీ అధినేత విడుదల లాంఛనమైంది.
ఇదీ చదవండి: